Site icon NTV Telugu

Union Minister Gajendra Singh Shekhawat: మోడీ విజన్, చంద్రబాబు ప్లానింగ్‌తో ఏపీ అభివృద్ధి..

Gajendra Singh Shekhawat

Gajendra Singh Shekhawat

Union Minister Gajendra Singh Shekhawat: ప్రధాని నరేంద్ర మోడీ విజన్, సీఎం చంద్రబాబు నాయుడు ప్లానింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్నారు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. ఇరిగేషన్, టూరిజం అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.. ఇక, ఎమర్జెన్సీ పెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన రోజును సంవిధాన్ హత్యా దివస్ గా జరుపుకున్నాం.. వాక్ స్వాతంత్ర్యం, భావ స్వాతంత్ర్యం కోల్పోయిన రోజుగా భావించామన్న ఆయన.. ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమంగా ఎమర్జెన్సీని గుర్తించారు.. 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజలు తమ నిర్ణయాన్ని ఇచ్చారని గుర్తుచేశారు..

Read Also: NTR: త్రివిక్రమ్ సినిమా హోంవర్క్ మొదలెట్టిన ఎన్టీఆర్.. ఇదిగో ప్రూఫ్?

ఇక, 450 కోట్లు టూరిజం నుంచి డబుల్ ఇంజన్ సర్కార్ ఇచ్చింది.. చాలా ప్రాజెక్టులు ఏపీకి వస్తున్నాయి.. వాటిలో ఒకటి రాజమండ్రిలో ఇవాళ ప్రారంభించాం.. సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి పలు ప్రాజెక్టులపై కూడా చర్చించామని వెల్లడించారు గజేంద్ర సింగ్‌ షెకావత్.. మోడీ విజన్, చంద్రబాబు ప్లానింగ్ తో ఏపీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న ఆన.. ఇరిగేషన్, టూరిజం అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.. ప్రణాళిక బద్ధంగా ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తాం అన్నారు.. మరోవైపు, పెహల్గామ్‌లో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.. పర్యాటకులు స్వేఛ్చగా అక్కడ ప్రాంతాలను సందర్శించ వచ్చు అన్నారు.. మరో పదిహేను రోజుల్లో అక్కడ పర్యాటకుల సందడి మొదలవుతుందని వెల్లడించారు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.

Read Also: Hyderabad: శంకర్ పల్లి రైలు పట్టాలపై కారు తీసుకెళ్లిన లేడీ కేసులో కొత్త కోణం..

కాగా, ఏపీలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పర్యటిస్తున్నారు.. ఆయన పర్యటనలో భాగంగా రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చారు.. విజయవాడలో బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు… ఎమర్జెన్సీ కి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంవిధాన్ హత్యా దివస్ గురించి మాట్లాడారు… ఏపీకి వచ్చే పలు ప్రాజెక్టులు డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా వస్తున్నాయని అన్నారు.. పెహల్గావ్‌లో పరిస్ధితులు చక్కబడ్డాయని, మరో 15 రోజుల్లో పూర్తిస్ధాయి పర్యాటకం చూడచ్చని కేంద్రమంత్రి తెలిపారు…

Exit mobile version