Actress Hema: చేయని తప్పుకి నన్ను బలి చేశారు.. కన్నీరు పెట్టుకున్న నటి హేమ..
- చేయని తప్పుకి నన్ను బలి చేశారు..
- కన్నీరు పెట్టుకున్న టాలీవుడ్ సీనియర్ నటి హేమ..
- ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న హేమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Hema: చేయని తప్పుకి నన్ను బలి చేశారంటూ కన్నీరు పెట్టుకున్నారు టాలీవుడ్ సీనియర్ నటి హేమ.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఆమె.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మ ఆలయంలో కన్నీరు పెట్టుకున్నారు.. ఈ రోజు దుర్గమ్మ దర్శనానికి వచ్చాను, ప్రతీ ఏడాది వస్తాను అని తెలిపిన ఆమె.. అయితే, ఈ సంవత్సరం ఓ ప్రత్యేకత ఉంది.. గత ఏడాది మీరందరూ నాపై వేసిన నీలపనిందలు దుర్గమ్మ తుడిచిపెట్టిందన్నారు.. ఇక, నేను చేయని తప్పుకి మీరందరూ నన్ను బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు నన్ను గుడికి వచ్చేటట్టు ఆ దుర్గమ్మ చేసిందన్నారు.. కానీ, దాని నుండి బయటపడడం నావల్ల కాలేదు. ప్రతిక్షణం దుర్గమ్మ తల్లి నేనున్నాను నువ్వు ముందుకెళ్లు అని నన్ను బతికిచ్చిందన్నారు.. ఎన్ని జన్మలెత్తినా దుర్గమ్మ ఆశీస్సులు అండదండలు నేను మర్చిపోలేను.. దయచేసి మీరు ఏదైనా వార్త వేసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకుని వేయండి అంటూ మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.. ఈరోజు నేను గుడిలో ఉండి చెప్తున్నాను.. నేను ఈ తప్పు చేయలేదు అని మరోసారి స్పష్టం చేశారు సినీ నటి హేమ..
Read Also: IND vs AUS: ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు స్టార్ ప్లేయర్ అవుట్.. రోహిత్, విరాట్..!
Also Read
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
కాగా, కొన్ని నెలల క్రితం రేవ్ పార్టీలో నటి హేమ కూడా పట్టుబడినట్లు బెంగళూరు పోలీసులు ప్రకటించడం అప్పట్లో టాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపింది. అంతేకాదు, హేమ డ్రగ్స్ సేవించిందని, టెస్ట్ రిపోర్ట్ లో కూడా పాజిటివ్ గా వచ్చిందంటూ పేర్కొన్న పోలీసులు.. ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత విచారణకు పిలిచి హేమను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు.. ఆ తర్వాత హేమపై నమోదైన కేసులో కోర్టు స్టే విధించడంతో ఆమెకు ఊరట దక్కినట్టు అయిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?