CM Revanth Reddy Vijayawada Visit: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బుధవారం రోజు విజయవాడ వెళ్లనున్నారు.. బెజవాడలో జరగనున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు వివాహానికి హాజరు కాబోతున్నారు రేవంత్ రెడ్డి.. ఇక, విజయవాడ పర్యటన కోసం ఉదయం 9.15 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు.. ఉదయం 10.40 గంటలకు కానూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారు.. ఉదయం 10.50 గంటల నుండి 11.30 గంటల వరకు అయన కల్యాణ మండపం నందు.. దేవినేని ఉమా కుమారుడు వివాహానికి హాజరై.. వధూవరులను ఆశీర్వదించనున్నారు.. విజయవాడ నుంచి తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి..
Read Also: YS Jagan: అందరూ ధోనీల్లా తయారు కావాలి.. పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
కాగా, గత వారం హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. తన కుమారుడు వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సీఎంకు అందించి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.. మరోవైపు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. దేవినేని ఉమాతో సన్నిహితంగా ఉండేవారు.. ఆ తర్వాత పార్టీ మారి.. తెలంగాణ సీఎం అయినా.. వారి మధ్య స్నేహ బంధం కొనసాగుతోంది.. దీంతో, మిత్రుడి ఆహ్వానం మేరకు ఆయన కుమారుడి వివాహానికి హాజరుకాబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ వివాహానికి హాజరు అయ్యే అవకాశం ఉండడంతో.. పెళ్లి వేడుకలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కలుసుకునే అవకాశం లేకపోలేదు..
