MLA Kolikapudi New Controversy: టీడీపీకి తలనొప్పిగా మారిన కొలికపూడి.. కొత్త వివాదం..!
- తీరు మార్చుకోని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్..
- వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కొలికపూడి శ్రీనివాసరావు..
- విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు..
- రాయల సుబ్బారావును టార్గెట్ చేసిన కొలికపూడి ..
- రాయల సుబ్బారావు లక్ష్యంగా వాట్సాప్ స్టేటస్‌లు..
- నువ్వు దేనికి అధ్యక్షుడివి..? పేకాట క్లబ్‌కా..? ..
- కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Kolikapudi New Controversy: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీరుమారడంలేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కొలికపూడి… సొంత పార్టీ నేతలతోనే కెలుక్కోవడంలో ముందుంటారు. ఆయన తీరు… ఒక్కోసారి మంచికి పోతున్నా చెడు ఎదురవుతున్న పరిస్థితి. స్థానిక నేతలతో వివాదాలు, సొంత పార్టీ నేతలతో విభేదాలతో కొలికపూడి బిజీగా ఉంటారు. ఆ మధ్య విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మాఫియాలను పెంచి పోషిస్తున్నారన్నారు. తనకు టికెట్ ఇప్పించేందుకు చిన్ని డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఈ విషయంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ అంశాన్ని క్రమశిక్షణా కమిటీకి అప్పగించారు. దీంతో కొలికపూడి శ్రీనివాసరావు… క్రమశిక్షణా కమిటీ ముందు హాజరై వివరణ కూడా ఇచ్చారు. క్రమశిక్షణా కమిటీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ వివాదం ఇంకా చల్లారకముందే… మరో విషయంలో నిప్పు రాజేశారు.
Read Also: AP FiberNet Case: సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేసిన ఏసీబీ కోర్టు
Also Read
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ వార్‌లో బిగ్ ట్విస్ట్.. నానిపై కేసు నమోదు
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ మధ్య మళ్లీ ముదిరిన వార్.. ఎంపీ చిన్నిపై ఈడీకి నాని ఫిర్యాదు
- AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
కొలికపూడి శ్రీనివాసరావు పెట్టిన వాట్సాప్ స్టేటస్… టీడీపీలో ప్రకంపనలకు కారణమవుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్గంపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును టార్గెట్ చేశారు కొలికపూడి. నువ్వు దేనికి అధ్యక్షుడివి..? పేకాట క్లబ్‌కా..? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్. పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే.. నువ్వు నిజంగా రాయల్ అంటూ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టారు. రాయల సుబ్బారావు ఎంపీ కేశినేని చిన్నీ వర్గం అనే ప్రచారం ఉంది. ఆయన్ని లక్ష్యంగా చేసుకునే ఇలా వాట్సాప్ స్టేటస్‌లు పెట్టారు కొలికపూడి శ్రీనివాసరావు. కొలికపూడి వాట్సాప్ స్టేటస్‌లు తిరువూరులో హాట్ టాపిక్‌గా మారాయి. పొలిటికల్ సర్కిల్స్‌లో దీనిపై చర్చ జరుగుతోంది. అయితే, కొలికపూడి వాట్సాప్ స్టేటస్‌ల ఎపిసోడ్‌పై టీడీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుంది..? ఈ అంశాన్ని కూడా క్రమశిక్షణా కమిటీకి అప్పజెబుతుందా..? మరోసారి క్రమశిక్షణా కమిటీ ముందు హాజరై కొలికపూడి శ్రీనివాసరావు వివరణ ఇచ్చుకుంటారా..? అనేది చూడాలి. కొలికపూడి వాట్సాప్ స్టేటస్‌లపై టీడీపీ ఎలా స్పందిస్తుంది..?
తాజావార్తలు
-
Dulquer Salmaan Action film : గేమ్ మొదలు పెట్టబోతున్న దుల్కర్ సల్మాన్… క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Emergency Fund: కష్టకాలంలో కాపాడేది ఎమర్జెన్సీ ఫండ్.. ఎంత పొదుపు అవసరం? ప్రతి కుటుంబం తెలుసుకోవాల్సిన విషయాలు
-
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
-
RAAKA : పుష్ప ప్యాట్రన్ ఫాలో అవుతున్న ‘రాకా’.. రిలీజ్ ఎప్పుడంటే?
-
Vaibhav Suryavanshi: ఒకరి తర్వాత ఒకరు.. 100 ఓవర్లు.. వైభవ్ కష్టాన్ని కళ్ళకు కట్టిన కోచ్!
ట్రెండింగ్
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!
-
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్‌పై హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!