గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురందేశ్వరి ఇండిగో విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా భారత ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్లో స్వల్ప మెజారిటీతో బీజేపీ కూటమి ప్రభుత్వం ఓటమికి గల కారణాలు సమీక్షిస్తామన్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఓడిపోతుందని చాలామంది ఫలితాలకు ముందే చెప్పారు.. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని పురందేశ్వరి తెలిపారు.
Read Also: Adani Group: గౌతమ్ అదానీ, సమీప బంధువు సాగర్‌కి సమన్లు
విభజించు.. పాలించు కులగణన చేసి పాలించు అనే కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీ నినాదానికి ప్రజలు స్వస్తి పలికారని పురందేశ్వరి పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి బీజేపీతో కలిసి నరేంద్ర మోడీ జీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందటమే కాకుండా సురక్షితంగా ఉంటుందని తెలిపారు. ప్రజలు నమ్మి హమ్ సాత్ ఏక్ హై అనే నినాదంతో ఎన్డీఏ కూటమి విజయానికి పట్టం కట్టారని పురందేశ్వరి అన్నారు. ఎన్డీఏ కూటమి విజయానికి వేసిన ఓట్లు కాదు.. మహారాష్ట్ర అభివృద్ధికి ప్రజలు వేసిన ఓట్లు అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Read Also: Priyanka Gandhi: పార్లమెంట్‌లో వయనాడ్ ప్రజల గొంతుకనవుతా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా… మ్యాజిక్ ఫిగర్ 145. మ్యాజిక్ ఫిగర్ ను ఎప్పుడో దాటేసిన మహాయుతి కూటమి 230 స్థానాల్లో విజయం ఖాయం చేసుకుంది. విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి 51 స్థానాల్లో ముందంజ వేసింది.