Vijayawada: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది.. రెండు రోజుల ముందే నగరానికి పండుగ శోభ సంతరించుకుంది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వటంతో విజయవాడ మీదుగా భారీగా ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం నుంచి విజయవాడకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. హైదరాబాద్ నుంచే ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు సాగిస్తుండటంతో బస్సులు ఫుల్ రష్ గా మారిపోయాయి.. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వారి సంఖ్యకు సమానంగా విజయవాడ-విశాఖపట్నం మధ్య కూడా రద్దీ ఉంది.. దీంతో హైదరాబాద్, విశాఖపట్నం ప్లాట్ ఫామ్స్ కిటకిటలాడుతున్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు తిరుపతి, కాకినాడకు కూడా భారీగా రాకపోకలు జరుగుతున్నాయి.
Read Also: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జట్టు ప్రకటన మరింత ఆలస్యం!
మరోవైపు.. పట్నం వాసులంతా పల్లె బాట పట్టారు.. సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు హైదరాబాద్ ప్రాంతం నుంచి గోదావరి జిల్లాల వైపు పెద్ద సంఖ్యలో జనం పయనం కావడంతో 16 నెంబర్ జాతీయ రహదారిపై రద్దీ వాతావరణం నెలకొంది. కలపరు టోల్‌గేట్ వద్ద కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కల్పిస్తోంది. ఉదయం ఐదు గంటల నుంచి ట్రాఫిక్ పెరుగుతూ వస్తోంది. దీంతో విలువైన పండుగ సమయం ట్రాఫిక్ లోనే గడిచిపోతుందని ఆందోళన వాహనదారుల్లో కనిపిస్తోంది. కలపరు టోల్ ప్లాజా దాటేందుకు కనీసం 30 నుంచి 40 నిమిషాల సమయం పట్టడంతో వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.