Site icon NTV Telugu

AP Liquor Scam: లిక్కర్ కేసులో సిట్ జోరు.. నిందితుల ఆస్తుల వివరాలు సేకరణ

Sit

Sit

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ జోరు పెంచింది. ఈ కేసులో అరెస్టైన ఏ1 కేసీరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఏ8 చాణక్య ఆస్తుల వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. 2019-2024 సమయంలో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఇవ్వాలని రిజిస్ట్రార్ శాఖ ఐజీని సిట్ కోరింది. ఏపీ, తెలంగాణలో ఉన్న రెండు రాష్ట్రాల ఐజీ రిజిస్ట్రార్‌కు సిట్ లేఖలు ఇచ్చింది. కేసీరెడ్డి భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా సిట్ గుర్తించింది. ఇక కేసీరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సన్నిహితుడు దిలీప్‌కు సిట్ నోటీసు ఇచ్చింది. కేసీరెడ్డి, చాణక్య చెప్పిన పనులను దిలీప్ చేసినట్టుగా సిట్ గుర్తించింది.

ఇది కూడా చదవండి: Tension : హయత్ నగర్ కోహెడలో ఉద్రిక్తత.. ప్లాట్స్ ఓనర్స్ లపై గొడ్డలి, రాళ్లతో దాడి

ఇక ఈ కేసులో ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని ఆయన ఆరోపించారు. మరోసారి విచారణకు పిలుస్తామని అధికారులు చెప్పినట్లుగా ఇటీవల మీడియాతో వెల్లడించారు.

ఇది కూడా చదవండి: BSF: అమృత్‌సర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం.. భారీగా ఆయుధాల స్వాధీనం

 

Exit mobile version