Site icon NTV Telugu

Bonda Uma and Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌పై బోండా ఉమా వరుస ట్వీట్స్‌.. వివాదం ముగిసినట్టేనా..?

Bonda Uma

Bonda Uma

Bonda Uma and Pawan Kalyan: అసెంబ్లీలో బోండా ఉమా ప్రశ్నోత్తరాల సమంలో చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యణ్ సీరియస్ అయ్యారు.. శాఖా పరంగా ఎంక్వైరీకి కూడా ఆదేశించారు… అసలు ఏ ఉద్దేశంతో బోండా ఉమా ఈ వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందో పూర్తిస్థాయి విచారణ చేసేందుకు పవన్‌ కల్యాణ్‌ సిద్ధమయ్యారనే ప్రచారం సాగింది.. సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఈ ఎపిసోడ్ తీసుకెళ్లాలని పవన్ సూచించారు. నెక్స్ట్ ఏం జరగబోతోంది… విచారణ తర్వాత పరిస్థితి ఏ రకంగా ఉండబోతోంది.. అనేది హాట్ టాపిక్‌గా మారిన సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది..

Read Also: CYBER : సైబర్ క్రిమినల్స్‌పై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసుల పంజా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాలలో భాగంగా జరుగుతున్న ప్రశ్నోత్తరాల సమయంలో, విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు బోండా ఉమా కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపై లేవనెత్తిన ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమాధానం ఇచ్చారంటూ డిప్యూటీ సీఎం ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలో షేర్‌ చేసిన వీడియోకి రిప్లే ఇచ్చిన బోండా ఉమ.. “అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రివర్యులు పవన్‌ కల్యాణ్‌ గారికి నా ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం..” అంటూ ట్వీట్‌.. ఇక, పవన్‌ కల్యాణ్‌ గారికి నా ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం..” అంటూ మరో ట్వీట్‌ చేశారు బోండా ఉమామహేశ్వరరావు.

కాగా, “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాలలో భాగంగా జరుగుతున్న ప్రశ్నోత్తరాల సమయంలో, విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు బోండా ఉమా కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపై లేవనెత్తిన ప్రశ్నలకు, సుదీర్ఘంగా సమాధానం ఇస్తూ, కాలుష్య నియంత్రణ మండలి లో ఉన్న ఇబ్బందులను, సిబ్బంది కొరత, నిధుల సమస్యను వివరించిన ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం వైసీపీ కి సంబంధించిన వ్యక్తుల కంపెనీలను టార్గెట్ చేసేలా కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా కాలుష్య నియంత్రణను ఉల్లంఘించే ప్రతీ ఒక్కరిపై చర్యలు తీసుకునేలా, అదే సమయంలో ఈ చర్యల కారణంగా కార్మికులు ఇబ్బంది పడకుండా చూసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అదే విధంగా సభ్యులు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉన్న ఇబ్బందులు అర్థం చేసుకోవాలని, త్వరలో పూర్తిస్థాయిలో బోర్డు సిబ్బంది కొరత పరిష్కరించడం ద్వారా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేలా తానే పర్యవేక్షించనున్నట్లు తెలిపారు..” అంటూ ట్వీట్ చేశారు.. ఈ సందర్భంగా అసెంబ్లీలో బోండా ఉమా ప్రశ్న.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమాధానికి సంబంధించిన వీడియోను ట్వీట్‌కు షేర్‌ చేశారు.. ఈ వ్యవహారంపై దుమారం రేగుతోన్న సమయంలో.. ఆ వీడియోని రీట్వీట్ చేస్తూ.. పవన్‌ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు బోండా ఉమా.. దీంతో, పవన్‌ కల్యాణ్ వర్సెస్‌ బోండా ఉమా వ్యవహారం ముగిసినట్టేనా? లేదా? అనేది వేచిచూడాలి..

Exit mobile version