Minister Satya Kumar Yadav: అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కావాలంటే సాధ్యం కాదు అన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఇదే సమయంలో.. ప్రైవేటు సంస్థలలో రాణించాలంటే.. నైపుణ్య శిక్షణ చాలా అవసరం అన్నారు.. విజయవాడలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలుపై అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహాసంఘ్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో రెండు రోజుల సెమినార్ జరుగుతోంది.. ఈ సెమినార్‌కు ముఖ్య అతిథి హాజరైన ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు రోజులు పాటు నూతన విద్యా విధానం పై చర్చించడం ఆనందంగా ఉంది అన్నారు. యాభై రోజుల పాలనలో ఇంకా నేను నేర్చుకునే పనిలోనే ఉన్నాను.. ఎన్నో సాదక బాధకాలు తెలుసుకుంటూ వాటిపై అవగాహన పెంచుకుంటున్నాను అన్నారు..
Read Also: Kolkata Airport: కోల్‌కతా ఎయిర్‌పోర్టును ముంచెత్తిన వరదలు.. నీళ్లలో విమానాలు
అయితే, గత ఐదేళ్లల్లో మన విద్యా విధానం భ్రష్టు పట్టిందని విమర్శించారు మంత్రి సత్యకుమార్.. భారతీయ విద్యా విధానం రూటుమార్చి.. బ్రిటీష్ విద్యను అమలు చేశారు.. ఇదే బానిస ఆలోచనలతో ఇంకా ఉంటే.. యువశక్తిని ఉపయోగించుకునే అవకాశం ఉండదు అన్నారు. భారతీయ విలువను జోడించి, కొత్త విద్యా విధానం అమలు చేయాల్సింది.. 1986లో కొత్త విద్యా విధానం రాజీవ్ గాంధీ నేతృత్వంలో వచ్చినా.. పూర్తిగా అమలు చేయలేదు. 2009 లో నాలెజ్డ్ కమీషన్ తీసుకు వచ్చి .. అందులో కొత్త విద్యా విధానం అమలు చేశారు.. ఈ దేశానికి ఇంగ్లీష్ అవసరమని విద్యార్దులపై బలవంతంగా రుద్దారు.. ఇటీవల మళ్లీ కొత్తగా అమల్లోకి వచ్చిన విద్యా విధానం వల్ల యువత భవిష్యత్ కు ఉపయోగపడుతుందన్నారు.. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కావాలంటే సాధ్యం కాదు.. ప్రైవేటు సంస్థలలో రాణించాలంటే.. నైపుణ్య శిక్షణ చాలా అవసరం అన్నారు. మరోవైపు బట్టిపట్టే చదువుల వల్ల జీవితంలో ఒడిదుడుకులు ఎలా ఎదుర్కొంటారు..? ఏ భాష అయినా మాధ్యమం మాత్రమే.. మాతృభాషను మరచిపోతే ఎలా? అని ప్రశ్నించారు. చైనా, జపాన్ లు పారిశ్రామికంగా ఎలా ఎదుగుతున్నారో చూడాలి.. ప్రాథమిక విద్య మొత్తం మాతృ భాషలో ఉంటేనే.. వారిలో సృజనాత్మకత బయటకు వస్తుందన్నారు. అన్ని దేశాల్లో ఇది అమలవుతున్నా.. మన దేశంలో మాత్రం పర భాషపై మోజు పెరిగిందని దుయ్యబట్టారు.
Read Also: Wayanad Landslides : వయనాడ్ ప్రమాదం.. 26మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన వ్యక్తి
ఎనిమిదో తరగతి నుంచి ఇతర దేశల భాషలు నేర్చుకునే అవకాశం కూడా నూతన విద్యా విధానంలో ఉంది అన్నారు మంత్రి సత్యకుమార్.. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినందువల్ల నేను ఇంజనీరింగ్ పూర్తి చేయలేక పోయాను.. ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థ ద్వారా విద్యార్దులకు ఎంతో మేలు చేస్తుంది.. టెక్నాలజీ, ఇండస్ట్రీయల్, అగ్రికల్చరల్ రెవెల్యూషన్ వచ్చిన సమయంలో దేశం కూలీలను తయారు చేసింది.. గతంలో ఉన్న విద్యావవస్థల ద్వారా ఇతరదేశాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి ఉండేది.. కొన్ని సంవత్సరాల పాటు ఉపాధి కోసమే కాదు.. విద్య కోసం వలసలు పోయారు.. ఇప్పుడు ఉన్న విద్యా విధానం విద్యార్దులకు ఒక వరం లాంటింది అన్నారు. గత పాలకులు సరైన విద్యా విధానం, ఆర్ధిక విధానం తీసుకురావడంలో విఫలమయ్యారు.. నేడు మన దేశం ఆర్ధిక వ్యవస్థగా ఎదిగి అగ్ర దేశాలకు ధీటుగా నిలుస్తుంది.. రిక్రూట్ మెంట్ పై తప్పకుండా ప్రత్యేక దృష్టి సారిస్తాం అని స్పష్టం చేశారు.
Read Also: Wayanad landslides: రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్న మోహన్‌లాల్..
రాష్ట్రాలు సహకారం లేకపోవడం వల్ల భారం మొత్తం కేంద్రంపై పడుతుందన్నారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్.. నాడు నేడు పేరుతో కూడా కేంద్రం డబ్బులతోనే నిర్మాణాలు చేశారు.. ఇరవై లక్షల బిల్లుకు రెండు లక్షల పని చేసి, 18లక్షలు దోచేశారు అని ఆరోపించారు. విద్యాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేర నిధులు ఇస్తున్నాయి..? అని ప్రశ్నించారు. విద్యార్దుల కోసం కేంద్రంతో పాటు, రాష్ట్రాలు కూడా ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు.. ఇప్పటి వరకు నూతన విద్యా విధానంలో వచ్చిన ఫలితాలు కేంద్రం వల్లే.. విద్యార్థులకి నైపుణ్య శిక్షణ ఎంతో అవసరం అన్నారు. భారత దేశం అభివృద్ధిలో ఈ నూతన జాతీయ విద్యా విధానం పాలసీ కీలక పాత్ర ఉంటుంది.. మనదేశంలో ఒక మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ లు సృష్టించాలంటే టెక్నాలజీ లాంటి విద్య అవరం అన్నారు. భారతీయ విలువలతో కూడిన విద్యా విధానం లేకపోవటం తోనే దేశం భ్రష్టు పట్టిందని విమర్శించారు.. మన దేశంలో కూడా విద్యపై ఎక్కువ ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.