Satya Kumar Yadav: డాక్టర్ సమరం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. విజయవాడలో జరిగిన డాక్టర్ సమరం రాసిన 218వ పుస్తకాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో అందరూ 60 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంటారు.. కానీ, 86 సంవత్సరాల వయసులో కూడా డాక్టర్ సమరం రిటైర్ కాలేదన్నారు.. వాజ్ పేయ్ కూడా రిటైర్ కాలేదు, అలసిపోలేదు అని ఒక సమావేశంలో చెప్పారని గుర్తుచేసుకున్నారు.. ఇక, ఆరోగ్య శాఖ గురించి తెలియాలంటే ఇన్ని పుస్తకాలు చదవాలా? అని నాకు తెలియదు అంటూ చమత్కరించారు..
Read Also: Janaki V vs State of Kerala: : ఓటీటీలోకి వివాదస్పద సినిమా.. ఎప్పుడంటే?
218 పుస్తకాలు రాసారు డాక్టర్ సమరం.. ఆధునిక రోజులలో కూడా మాట్లాడటానికి ఆలోచిస్తున్న అంశాలను డాక్టర్ సమరం పదుల సంవత్సరాల క్రితమే చెప్పారు.. సైన్స్ గురించి విస్తారంగా తెలిసిన వ్యక్తి డాక్టర్ సమరం అని ప్రశంసలు గురిపించారు సత్యకుమార్.. బ్లడ్ కి ఆల్డర్నేట్ లేదనుకుంటుంటే.. ఆర్టిఫిషియల్ బ్లడ్ సెల్స్ వస్తాయనుకుంటానన్న ఆయన.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పుట్టడం వలన సమరం గారికి గోరా గారు ఆ పేరు పెట్టారు అని గుర్తుచేశారు.. అయితే, ఈ రోజుల్లో పేరు పెట్టాలంటే రప్పా రప్పా అని పెడతారేమో..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఇలాంటివి పెట్టడం సరైనది కాదు.. ఏదో ఒక సరైన ఉద్దేశంతో చేయాలన్నారు.. ఇక, నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక టెక్నాలజీ అభివృద్ధి చాలా వేగంగా జరిగిందన్నారు..
Read Also: Gachibowli: గచ్చిబౌలిలో పిడుగు.. భయబ్రాంతులకు గురైన జనం..!
ఆరోగ్య రంగంలోనే 25 యూనికార్న్ లు మన దేశంలో ఉన్నాయి.. యువతకు సెక్స్ ఎడ్యుకేషన్ చాలా అవసరం అన్నారు మంత్రి సత్య కుమార్.. గతంలో చాటుగా స్వాతి బుక్ చదివేవాళ్లం అంటూ.. గతంలో పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.. అయితే, ఇప్పుడు నేను వెళ్లే ప్రతీ కార్యక్రమంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై మాట్లాడుతాను అని తెలిపారు.. ఇక, డాక్టర్ సమరం, వారి సోదరుడు, సోదరి పేర్లను వారి తండ్రి గోరా గారు పెట్టిన పేర్లను చూస్తేనే.. ఆయన ఎంత అభ్యుదయ వాదో అర్థం అవుతుందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్..
