NTV Telugu Site icon

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi Case: వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ కేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వల్లభనేని వంశీ రిమాండ్‌ను పొడిగించింది జిల్లా కోర్టు.. ఆత్కురులో 9 ఎకరాలు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని నమోదైన కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం.. వంశీ రిమాండ్‌ను ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.. మరోవైపు, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది.. గన్నవరంలో సీతామహాలక్ష్మి అనే మహిళ స్థలం కబ్జా చేశారన్న కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది..

Read Also: Kannappa: అదంతా అబద్దం.. కన్నప్ప టీం క్లారిటీ

మరోవైపు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ1గా ఉన్న వంశీ ప్రధాన అనుచరుడు రంగాను సీఐడీ కస్టడీకి ఇచ్చింది న్యాయస్థానం.. దీంతో, రేపటి నుంచి మూడు రోజుల పాటు రంగను విచారించనున్నారు సీఐడీ అధికారులు.. మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు అనుమతి ఇచ్చింది కోర్టు.. కాగా, ఇదే కేసులో ఏ71గా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌..