Site icon NTV Telugu

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం.. షాకిచ్చిన నూజివీడు కోర్టు..

Nuzvid Court

Nuzvid Court

Vallabhaneni Vamsi: వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్ కు అనుమతి ఇచ్చింది నూజివీడు కోర్టు.. ఈ నెల 19వ తేదీలోపు వల్లభనేని వంశీ మోహన్‌ను ఈ కేసులో హాజరు పరచాలని ఆదేశాలు ఇచ్చింది నూజివీడు కోర్టు.. అయితే, ఇప్పటికే వల్లభనేని వంశీపై ఆరు కేసులు ఉండగా.. ఐదు కేసుల్లో బెయిల్‌, ముందస్తు బెయిల్‌ వచ్చింది.. కానీ, రేపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెలువడనుంది.. దీంతో, రేపు వంశీకి బెయిల్‌ వచ్చినా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.. మరోవైపు.. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీని కోర్టులో హాజరు పర్చనున్నారు పోలీసులు.. రేపే వంశీని నూజివీడు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందంటున్నారు..

Read Also: India Turkey: టర్కీకి షాక్ ఇచ్చిన భారత్..

వల్లభనేని వంశీపై మొత్తం ఆరు కేసులు నమోదు కాగా.. ఇప్పటికే ఐదు కేసుల్లో వంశీకి బెయిల్, ముందస్తు బెయిల్ మంజూరు అయ్యాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాత్రం.. వంశీ బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు వెల్లడించనుంది కోర్టు.. అయితే, ఈ సమయంలో బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో మాజీ ఎమ్మల్యే వల్లభనేని వంశీపై నమోదైన కేసులో ఇవాళ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్ కు అనుమతి ఇచ్చింది నూజివీడు కోర్టు.. దీంతో, వల్లభనేని వంశీకి రేపు బెయిల్ వచ్చినా.. జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది.. ఇక, రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ జైల్లో అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంతో ఆయన ఇబ్బందులు పడ్డారు. ఇది గమనించిన పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించిన విషయం విదితమే..

Exit mobile version