Site icon NTV Telugu

Kesineni Chinni: నెల రోజుల్లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్కు ఎన్నికలు

Kesineni

Kesineni

Kesineni Chinni: ఇవాళ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు క‌ర్నూల్ జిల్లా క్రికెట్ అసోసియేష‌న్ వైస్ ప్రెసిడెంట్, విజ‌యవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల రోజుల్లో ఏసీఏలో ఎన్నిక‌లు జ‌రుగుతాయన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎన్నిక‌ల ఆఫీస‌ర్‌గా నిమ్మగ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను నియమించినట్లు తెలిపారు. త్వరలో ఏసీఏ పాలకవర్గం ఎన్నికకు ఏర్పాట్లు జరగబోతున్నాయని అన్నారు.

Read Also: Bangladesh clashes: బంగ్లాదేశ్‌ ఘర్షణల్లో 93కి చేరిన మృతుల సంఖ్య..

కాగా, ఏసీపీ ప్రత్యేక స‌ర్వ స‌భ్య స‌మావేశంలో పాత బోర్డ్ స‌భ్యుల ఒక్కసారిగా చేసిన రాజీనామాలు ఆమోదించామని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. వారు ఏసీఏకి చేసిన సేవ‌ల‌కు కృత‌జ్ఞత‌గా స‌న్మానించాం.. ఈ నెల రోజులు ఏసీఏ కార్యక‌లాపాల‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా త్రిస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేశామని ఎంపీ ప్రకటించారు. ఈ క‌మిటీలో ఆర్వీ ఎస్కే రంగ‌రావు, మ్యాన్ చో ఫేరార్, జాగ‌ర్ల మూడి ముర‌ళీ మోహ‌న్ రావు స‌భ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. అనంత‌రం జ‌రిగిన జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్‌లో క్రికెట్ స్టేడియాల ప‌రిస్థితిపై ప్రధానంగా చర్చించినట్లు చెప్పుకొచ్చారు. క్రికెట్ క్రీడాకారుల స‌దుపాయ‌ల‌పై కూడా సర్వసభ్య సమావేశంలో మాట్లాడినట్లు ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు.

Exit mobile version