Site icon NTV Telugu

Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ను విచారించనున్న ఎక్సైజ్ శాఖ..

Jogi

Jogi

Jogi Ramesh: నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాములను ఎక్సైజ్ పోలీసులు ఇవాళ (నవంబర్ 26న) నుంచి విచారణ చేయనున్నారు. ఈ కేసులో జోగి రమేష్ ఏ18, జోగి రాము ఏ19గా ఉన్నారు. నకిలీ మద్యం తయారు కేసులో నిందితుడుగా ఉన్న అద్దేపల్లి జనార్ధన్ తో కలిసి జోగి రమేష్ ఆయన సోదరుడు రాము వ్యాపారం చేసినట్లుగా ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Trump: అలా జరిగితేనే పుతిన్-జెలెన్‌స్కీని కలుస్తా.. ఉక్రెయిన్-రష్యా ఒప్పందంపై ట్రంప్ వ్యాఖ్య

కాగా, గత 25 రోజులుగా జోగి బ్రదర్స్ నెల్లూరు సబ్ జైల్లో ఉన్నారు. వీరిని కస్టడీకి తీసుకొని నకిలీ మద్యం తయారీకి సంబంధించి కీలక విషయాలు విచారించాల్సిన అవసరం ఉందని కోర్టులో అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఇవాళ్టి నుంచి నాలుగు రోజులు పాటు జోగి బ్రదర్స్ ని అధికారులు విచారణ చేస్తారు. అయితే, నెల్లూరు జైలు నుంచి జోగి బ్రదర్స్ ని విజయవాడకు తీసుకుని వచ్చి నాలుగు రోజులు ఇక్కడే ఉంచి దర్యాప్తు చేయనున్నారు.

Exit mobile version