NTV Telugu Site icon

Nadendla Manohar: గ్రూపు రాజకీయాలు వద్దు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి..!

Nadendla

Nadendla

Nadendla Manohar: జనసేన సభ్యత్వ నమోదులో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వ్యూహంతో ముందుకు వెళ్ళాలి.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో మంచి విజయం సాధించాలి.. అన్ని డివిజన్స్ ఒకే ఆలోచనతో ముందుకు వెళ్లాలి.. నామినేటెడ్ పోస్టుల గురించి హడావిడి పెరిగింది.. కష్టపడి పని చేసిన వారి సమాచారం పవన్ కళ్యాణ్ కు ఉంది.. అంకితభావంతో పని చేసిన వారు రిజల్ట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని తెలిపారు. నిజాయతీగా పని చేసిన వారి గుర్తింపు ఉంటుంది.. తక్కువ సీట్లు అంటు అనేకమంది మాట్లాడారు.. ఈ రోజు భారతదేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నాం.. మండలిలో కూడా మనం ఉన్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ వెల్లడించారు.

Read Also: Aanvi kamdar: విషాదంగా ముగిసిన ట్రావెల్ డిటెక్టివ్ ప్రయాణం.. ఆన్వీ కామ్‌దార్ బ్యాగ్రౌండ్ ఇదే!

ఇక, జనసేన పార్టీ అంచలంచెలుగా ముందుకు వెళ్తుంది అని నాదేండ్ల మనోహార్ తెలిపారు. విజయవాడలో మనకు జరిగిన నష్టాన్ని అధిగమిద్దాం.. పార్టీ బలోపేతం, కూటమి విజయం కోసం అందరూ నిలబడాలి.. గ్రూపు రాజకీయాలు వద్దు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అని పిలుపునిచ్చారు. గతంలో జన సైనికులపై దాడి చేసిన వారిని వీర మహిళలను అవమానించిన వారిని వదిలేది లేదు.. విజయవాడలో జనసేన పార్టీ బలోపేతం అవ్వాలి అని మంత్రి నాదేండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

Show comments