NTV Telugu Site icon

Heavy Rains in Vijayawada: వర్ష బీభత్సం.. విజయవాడలో విరిగిపడిన కొండచరియలు.. ఒకరు మృతి

Vja

Vja

Heavy Rains in Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఇక, విజయవాడలోనూ ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది.. దీంతో.. విజయవాడ సున్నపు బట్టీల సెంటర్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి… ఈ ఘటనలో ఓ ఇల్లు కూలిపోయింది.. నలుగురురికి తీవ్రగాయాలు అయినట్టు చెబుతున్నారు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని రెండు చోట్ల ఇళ్లు కూలాయి.. దీంతో.. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. రెండు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు సిబ్బంది.. శిథిలాల్లో తొమ్మిది మంది చిక్కుకోగా.. వారిని వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు.. అయితే, వారిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.. శిథిలాల నుంచి ఆరుగురును వెంటనే వెలికి తీశారు స్థానికులు.. సహాయక సిబ్బంది.. మరిన్ని శిథిలాలను తొలగించి మరొక వృద్ధురాలిని బయటకు తీశారు.. బాధితురాలిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.. బయటకు వచ్చిన ఏడుగురిలో ఒకరు మృతి చెందారని సిబ్బంది చెబుతన్నారు.

Read Also: Radikaa Sarathkumar: సీక్రెట్‌ కెమెరాలు పెట్టి.. ప్రైవేట్‌ వీడియోలు చిత్రీకరించారు! రాధిక సంచలన వ్యాఖ్యలు

నిన్నటి నుంచి ఎడతెరప లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో 45 డివిజన్ 51 వ డివిజన్ లో ఇళ్లు కూలాయి.. ఇల్లులు కులడంతో మెట్లు దెబ్బతిని కొండ ప్రాంతంలో ఉండే పాదాచార్యులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ముఖ్యంగా కొండా ప్రాంత వసూలకు ఒకదానికి అనుకోని మరొక ఇల్లు ఉంటాయి.. అందువల్ల ఒక ఇల్లు కులడంతో పక్క ఇల్లు కూడా దెబ్బతింటున్నాయి.. అధికారులకు సమాచారం అందించినా.. పట్టించుకోవడం లేదని బాధితులు మండిపడుతున్నారు.. ఇక, ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో బెజవాడ సిటీ నీట మునిగినంత పని అవుతుంది.. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.. నగరంలోని ప్రధాన రహదారులైన ఏలూరు రోడ్డు, నక్కల్ రోడ్డు, బస్టాండ్ పరిసర ప్రాంతాలుచ భవానిపురం జలమయం అయ్యాయి.. భారీ వర్షం దెబ్బకు రోడ్ల మీదకి రావడం లేదు నగరవాసులు.. మరోవైపు.. రోడ్లమీదకు వచ్చిన వాహనాలన్నీ వరద నీటిలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు..