Site icon NTV Telugu

Fake ED Officers: ఈడీ అధికారుల దారి దోపిడీ.. 70 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు..

Fake Ed

Fake Ed

Fake ED Officers: గుంటూరు జిల్లాలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) పోలీసులమంటూ నటించిన దుండగులు భారీ దోపిడీ చేశారు. సుమారు రూ. 70 లక్షల నగదుతో పాటు ఒక వ్యక్తిని కూడా తీసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, మహారాష్ట్రకు చెందిన జగదీష్, రంజిత్ అనే ఇద్దరు వ్యక్తులు బంగారు నగల తయారీ షాపులో పని చేస్తున్నారు. ఈ క్రమంలో రంజిత్, జగదీష్‌కు ఫోన్ చేసి తన దగ్గర రెండు కేజీల ముడి బంగారం ఉందని పేర్కొన్నాడు. ఆ బంగారం కొనేందుకు సత్తెనపల్లికి రావాలని సూచించాడు. ఈ మేరకు జగదీష్ రూ.70 లక్షల నగదుతో సత్తెనపల్లికి వెళ్లాడు.

Read Also: Samsung Galaxy Z Fold 7 Enterprise Edition: 200MP కెమెరా, AI ఫీచర్లు, హై సెక్యూరిటీ… కార్పొరేట్ అవసరాల కోసం శాంసంగ్ నుంచి కొత్త ఫోల్డబుల్ మొబైల్!

అయితే, వ్యాపారం తర్వాత జగదీష్ విజయవాడకు తిరిగి వెళ్తుండగా, మేడికొండూరు ఈద్గా దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు అతని కారును అడ్డుకుని.. తాము ఈడీ అధికారులమని చెప్పి.. కారులో ఉన్న నగదుతో పాటు రంజిత్‌ను కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత రంజిత్‌కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో, జగదీష్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు.. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు, ఫోన్ కాల్స్ రికార్డుల ఆధారంగా ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు పోలీసులు..

Exit mobile version