Jogi Ramesh PA: ఇవాళ ఉదయం జోగి రమేష్తో పాటు పీఏ ఆరేపల్లి రామును అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉదయం 12 గంటల సమయంలో జోగి పీఏ ఆరేపల్లి రామును బయటకు వదిలి పెట్టారు. తిరిగి తాము చెప్పినప్పుడు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పీఏ రాము మాట్లాడుతూ.. జోగి రాము ఇళ్లు చూపించమని నన్ను ఎక్సైజ్ అధికారులు వాహనం ఎక్కించుకుని వెళ్ళారు.. ఆ తర్వాత ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్ కు తీసుకు వచ్చి ఇప్పటి వరకు కూర్చోబెట్టారు అని తెలియజేశాడు.
Read Also: Bihar Elections: బీహార్ ఎన్నికల అధ్యయనానికి విదేశీ దౌత్యవేత్తలు..
ఇక, మరి కొద్దిసేపట్లో జోగి రమేష్ ను విచారించే అవకాశం ఉంది అని ఆరేపల్లి రాము తెలిపాడు. నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న నిందితుడు జనార్ధన్ తో జోగి రమేష్ కుటుంబ సభ్యులకు, నాకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవు.. జోగి రమేష్ కు జనార్ధన్ కు కాల్స్ చేసుకునేంత పరిచయం లేదు.. ఇబ్రహీంపట్నంలో జనార్ధన్ ఉంటాడని తప్ప మరో రకంగా మాకు తెలియదు అన్నాడు. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి పంపించారని జోగి రమేష్ పీఏ ఆరేపల్లి రాము వెల్లడించారు.
