NTV Telugu Site icon

Kesineni Nani: పదవిలో ఉన్న లేకపోయినా.. ప్రజలకు అందుబాటులో ఉంటా

Nani

Nani

Kesineni Nani: నందిగామలో మాజీ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను రాజకీయాల నుంచి తప్పుకున్నా ప్రజా సేవలో ఎప్పడు ఉంటాను.. నాకు విజయవాడ అంటే మమకారం పిచ్చి.. విజయవాడ నాకు రెండు సార్లు ఎంపీగా పని చేసే అవకాశం కల్పించింది అని పేర్కొన్నారు. నేను నా ఎంపీ పదవిని ఎప్పడు నా స్వార్థానికి వాడుకోలేదు.. పదేళ్ల పాటు ఎంపీగా ఉన్నాను.. విజయవాడకు ఏమైనా చేసిన వ్యక్తి అంటే రతన్ టాటా.. కేంద్రమంత్రి గడ్కరీతో కలిసి అసాధ్యమైన దుర్గ గుడి ఫ్లై ఓవర్ నిర్మించాను అని ఆయన చెప్పుకొచ్చారు.

Read Also: First GBS Death In AP: ఏపీలో తొలి జీబీఎస్ మరణం.. ఏపీ సర్కార్ అలర్ట్

అయితే, పదేళ్ల పాటు ఎవరి దగ్గర కప్పు టీ కూడా తాగకుండా పని చేశాను అని విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పని చేశా.. పది లక్షల మందికి మూడేళ్ల పాటు వైద్య సేవలు అందించాం.. ఇక, నందిగామలో చిన్న పని చేస్తే నన్ను గుర్తించుకొని పిలిచారు అని కేశినేని నాని అన్నారు. నేను చాలా పనులు చేసిన గుర్తు పెట్టుకోలేదు.. నిరంతరం ప్రజల కోసం పని చేశాను.. పదవిలో ఉన్నా లేకపోయినా అందుబాటులో ఉంటాను అని తెలిపారు.