Site icon NTV Telugu

Diarrhea Cases: విజయవాడలో తగ్గని డయేరియా కేసులు.. ఇప్పటికే 380కి పైగా..!

Vja

Vja

Diarrhea Cases: విజయవాడలోని కొత్త రాజరాజేశ్వరి పేటలో రోజు రోజుకు డయేరియా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే, బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే, ఇప్పటి వరకు 380 మందికి పైగా డయేరియా సోకినట్లు సమాచారం. ఇంకా 120 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ట్రీట్మెంట్ అనంతరం ఇంటికి వెళ్ళినా, ఆ తర్వాత కూడా డయేరియాతోనే వారు తిరిగి దవాఖానకు వస్తున్నారు.

Read Also: Murder: కూతురు స్నానం చేస్తుండగా ఫొటోలు తీసిన వీడియోగ్రాఫర్.. సినిమా రేంజ్‌లో హత్య చేసిన తండ్రి..!

అయితే, డయేరియాకు సంబంధించిన నీటిని సేకరించి ల్యాబ్ కి పంపిన రిపోర్టులు ఇవాళ్టికి కూడా రాలేదు. మరోవైపు, విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో మళ్లీ కేసులు పెరుగుతుండటంతో మెడికల్ క్యాంపునను కొనసాగిస్తున్నారు. మెడికల్ క్యాంపులో బ్లడ్ శాంపిల్స్ తీసుకుని వాటిని టెస్టుల కోసం ల్యాబ్ కి పంపిస్తున్నారు. ఇప్పటి వరకూ జ్వరాల కోసం మాత్రమే బ్లడ్ టెస్టులు చేస్తున్నారు.. అలాగే, బాధిత కుటుంబాలకు మంచినీరు, శానిటైజేషన్ కిట్లను అధికారులు పంపిణీ చేస్తున్నారు. డయేరికాకు గల కారణాలు తెలీక ఆందోళనలో రాజరాజేశ్వరి పేట వాసులు ఉన్నారు.

Exit mobile version