NTV Telugu Site icon

Kesineni Chinni: దేశంలోనే టాప్-10 విమానాశ్రయాల్లో విజయవాడ ఎయిర్పోర్టు ఉండేలా చేస్తాం..

Vja

Vja

Kesineni Chinni: కృష్ణాజిల్లా జిల్లాలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ప్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఏఏసీ చైర్మన్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏఏసీ వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ తో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి పార్టీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని చిన్ని మాట్లాడుతూ.. దేశంలోనే మొదటి పది విమానాశ్రయాల్లో విజయవాడ ఎయిర్ పోర్టును ఒక్కటిగా తీర్చి దిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. పనుల్లో మరింత పురోగతి సాధించేలా ప్రతి వారం రివ్యూ మీటింగ్ నిర్వహిస్తాం.. అమరావతికి ప్రముఖుల రాకపోకలతో తాకిడి పెరుగుతున్నందున వీలైనంత త్వరగా నూతన టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు ఆదేశించడం జరిగిందని వెల్లడించారు.

Read Also: West Bengal: ట్రైనీ డాక్టర్ ఘటన మరవక ముందే.. బెంగాల్‌లో మైనర్ బాలికపై దారుణం..

ఇక, 2025 జనవరి నాటికి కాంక్రీటు పనులు పూర్తవుతాయని ఎంపీ కేశినేని చిన్న తెలిపారు. అనంతరం జూన్ నాటికి గ్లాస్, ఇతర పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతాం.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో రూపొందిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను జూన్ నాటికి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటాం అన్నారు. భద్రతకు కేంద్ర సీఐఎస్ఎఫ్ బలగాలు కేవలం 230 మందిని మాత్రమే కేటాయించారు.. వాళ్లు సరిపోకపోవడంతో ఇంకా సిబ్బంది కావాలని కోరాం.. వారణాసి, కొచ్చి సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు, అంతర్జాతీయ విమాన సర్వీసులు పెంపుకి సంబంధించి కేంద్రంతో సంప్రదింపులు జరిపామని కేశినేని చిన్ని పేర్కొన్నారు.

Show comments