NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: కనకదుర్గమ్మ ఆలయ శుద్ధిలో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌.. సంచలన వ్యాఖ్యలు..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంపై పెద్ద దుమారమే రేగుతోంది.. ఈ నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఇక, దీక్షలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు.. దుర్గమ్మ టెంపుల్ మెట్లను స్వయంగా శుభ్రం చేసిన పవన్‌.. ఆ తర్వాత వాటికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టారు.. ఇక, అమ్మవారిని దర్శించుకున్నారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రాయశ్చిత్త దీక్షకు ఇవాళ మూడోరోజు.. మేం రామభక్తులం.. ఆంజనేయస్వామిని పూజిస్తాం.. సగటు హిందువుకు ఎలాంటి భయం, ఇతర మతాల పైన ద్వేషం ఉండదు.. కనకదుర్గమ్మ రథం సింహాలు మాయమైతే వైసీపీ నేతలు అపహాస్యం చేశారు అని మండిపడ్డారు.. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి మతం పుచ్చుకున్నారా? లేదా నాకు తెలీదు.. వైఎస్‌ జగన్ ను నేను ఎత్తి చూపడం లేదు.. మీ సమయంలో జరిగిన అపచారంపై స్పందించాలి అని డిమాండ్‌ చేవారు.

Read Also: Mahabubabad: రోడ్డుపై బోల్తాపడిన చేపలలోడు బొలోరో వాహనం..

రాజ్యాంగం బాగుండాలి అని పాటుపడుతున్నాం మేం.. సెక్యులరిజం అన్ని వైపుల నుంచి రావాలి అన్నారు పవన్‌ కల్యాణ్.. సాటి హిందువులు.. తోటి హిందువులను తిట్టడం ఆక్షేపణీయం అన్నారు.. మసీదులో చిన్న అపచారం జరిగితే ఇలాగే మాట్లాడతారా..? హిందువుల పట్ల ఎలా మాట్లాడతారు..? అని ప్రశ్నించారు.. పొన్నవోలు సుధాకర్ పొగరుగా మాట్లాడారు… తమాషాలుగా ఉందా.. సరదాలుగా ఉన్నాయా..? అంటూ మండిపడ్డారు.. అపవిత్రం జరిగిందని మాట్లాడాను.. మాట్లాడకూడదా..? అని నిలదీశారు.. మరోవైపు.. ప్రకాష్ రాజ్ కూడా చెపుతున్నా… సెక్యులరిజం టూవే.. ఒన్ వే కాదు అని సూచించారు.. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉంది.. కానీ, ఆయన సరిగా మాట్లాడాలన్నారు.. సనాతన ధర్మంపై దాడి జరిగినపుడు మాట్లాడకూడదా? ప్రకాష్ రాజ్ గారూ.. మేం చాలా బాధపడ్డాం.. మీకు ఇది ఇదంతా హాస్యం కావచ్చు‌. మాకు ఇదంతా చాలా బాధ అని పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్‌..

Read Also: Jr NTR : దేవర RTCక్రాస్ రోడ్ ‘ఆల్ టైమ్ రికార్డ్’.. ప్రభాస్, మహేష్ రికార్డ్స్ గల్లంతు

ఇష్టానికి సనాతన ధర్మంపై మాట్లాడుతున్నారు.. మీరు సరస్వతీ దేవి, దుర్గాదేవి లపై జోకులు వేస్తారా? అని మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్.. సనాతనధర్మ రక్షణ అనేది గుడికెళ్ళే ప్రతీ హిందువు బాధ్యత కాదా? అని ప్రశ్నించారు.. నామీద కోర్టులో కేసులేసుకోండి.. సనాతన ధర్మం గురించి మాట్లాడితే రోడ్లమీదకు లాగుతాం అని హెచ్చరించారు.. భూమన కరుణాకర రెడ్డిగారి నాశనం మొదలైంది.. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి కూడా విచారణకు రావాలి అంటూ హాట్‌ కామెంట్లు చేశారు.. సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తే.. చనిపోవడానికి సిద్ధం నేను.. మీ ప్రభుత్వాన్ని పడకొట్టిన మేం.. ఏమీ చేయలేం అనుకుంటున్నారా? అని వార్నింగ్‌ ఇచ్చారు.. మీ మౌనంతో తరాలు నాశనం అయిపోతాయి.. భారతదేశపు సినిమా అభిమానులు అందరూ హిందువులు కాదా? అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్..