Site icon NTV Telugu

Cyclone Montha: విజయవాడకు మొంథా తుఫాన్‌ ముప్పు.. రోడ్లపైకి రావద్దు..! నగరవాసులకు వీఎంసీ వార్నింగ్

Cyclone Montha Effect On Vi

Cyclone Montha Effect On Vi

Cyclone Montha: తీరం వైపు దూసుకొస్తున్న మొంథా తుఫాన్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలను టెన్షన్‌ పెడుతోంది.. మొంథా తుఫాన్‌ ప్రభావంతో రేపు విజయవాడలో 162 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (వీఎంసీ) అధికారులు.. రేపు అత్యవసరమైతే తప్పా ప్రజలకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్న అధికారులు.. తీవ్రత ఎక్కువ ఉంటే దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.. మెడికల్ షాపులు, కూరగాయలు, పాలు విక్రయ దుకాణాలు తెరుచుకోవచ్చని సూచిస్తున్నారు.. రోడ్లపై రాకపోకలు తగ్గించుకోవాలని వార్నింగ్ ఇచ్చారు వీఎంసీ అధికారులు.. చివరకు వాకింగ్ కి వెళ్లొద్దని సూచించారు.. మరోవైపు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్, వీఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.. అత్యవసర పరిస్థితుల్లో ఎన్టీఆర్ జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్: 9154970454, వీఎంసీ కంట్రోల్ రూమ్‌: 0866 2424172, 0866 2422515, 0866 2427485 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు..

Read Also: Flights Cancelled: మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్.. పలు విమానాలు రద్దు..

మొత్తంగా మొంథా తుపాన్ నేపథ్యంలో అప్రమత్తమయ్యారు విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు.. నగరంలోని లోతట్టు ప్రాంతాలకు వరద, ముంపు సమస్య ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు.. కొండ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. రేపు భారీ వర్షం, ఈదురు గాలుల ప్రభావంతో కొండ చెరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.. ఇప్పటికే వీఎంసీ పరిధిలోని 64 డివిజన్లలో 40 వరకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్య లేకుండా నీటిని తోడేందుకు ట్యాంకర్లు, జేసీబీలను సిద్ధంగా ఉంచారు విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు.

Exit mobile version