Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వల్లభనేని వంశీమోహన్‌కు మరోసారి కోర్టులో షాక్ తగిలింది.. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో నేటితో వల్లభనేని వంశీ రిమాండ్ ముగియడంతో.. న్యాయమూర్తి ఎదుట వంశీ మోహన్‌ను హాజరుపరిచారు పోలీసులు.. అయితే, వల్లభనేని వంశీకి షాక్ ఇస్తూ.. మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.. మరోవైపు.. ఈ నెల 13వ తేదీతో వల్లభవేని వంశీ మోహన్ రిమాండ్ 90 రోజులు పూర్తి అవుతుందని పోలీసులు చెబుతున్నారు.. ఈ నేపథ్యంలో వంశీ ఆ తర్వాత ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. ఇక, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయినా.. ఆ తర్వాత పలు కేసులు నమోదు అయ్యాయి.. దీంతో, ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఉన్నా.. మిగతా కేసుల సంగతి ఏంటి? అనేది ఉత్కంఠగా మారింది.. అయితే, కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించడంతో.. వల్లభనేని వంశీ మోహన్‌ను కోర్టు నుంచి తిరిగి విజయవాడ సబ్ జైలుకు తరలించారు పోలీసులు..
Read Also: Squid Game S3 : ‘స్క్విడ్‌గేమ్ 3’ టీజర్ రిలీజ్.. !
