NTV Telugu Site icon

AP CM: ముంపు బాధితుల ఇబ్బందులు ప్రత్యక్షంగా చూశా.. అందరికి అండగా ఉంటా..!

Ap Cm

Ap Cm

AP CM: విజయవాడ నగరంలోని సింగ్ నగర్ ప్రాంతంలో వరద ఉధృతి ప్రాంతాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ల సాయంతో వరద చిక్కుకున్న వ్యక్తులను బయటకు తీసుకువస్తున్నాట్లు.. బాధితులకు ఆహారం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ముంపు బాధితుల ఇబ్బందులు ప్రత్యక్షంగా చూసాను.. బాధితులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాను అని పేర్కొన్నారు. ఇంత వరదను ఊహించలేదు.. నా రాజకీయ జీవితంలో ఇలాంటి వరదలు చూడలేదు.. అవసరమైతే మళ్ళీ వస్తాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Read Also: Vijayawada: విజయవాడలో వెనక్కి ప్రవహిస్తోన్న బుడమేరు వాగు

ఇక, అధికారులను అందుబాటులో ఉంచుతాను అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతీ ఒక్కరి కష్టాన్ని చూసాను.. అందరికీ ఆహార పదార్థాలు సరఫరా చేస్తాం.. లోతట్టు ప్రాంతాల వారు దగ్గరిలోని పెద్ద బిల్డింగులోకి వెళ్ళండి.. పెద్ద బిల్డింగుల వాళ్ళు పెద్ద మనసుతో అందరికీ సహకరించాలి.. బోట్లు లేకపోవటం వల్ల కొంత జాప్యం జరుగుతుంది.. గంట గంటకు పరిస్థితి మానిటర్ చేస్తాను.. 24/7 అందుబాటులో ఉండి.. అందరూ సురక్షితంగా బయట పడే వరకు విశ్రమించను అని ముఖ్యమంత్రి అన్నారు. ఇంకా రెస్య్కూ సిబ్బందిని ఎక్కువగా విధులు నిర్వహించేలా ఏర్పాటు చేస్తాం.. ప్రతి ఒక్కరికి తినడానికి ఆహారంతో పాటు ఉండటానికి సదుపాయం కూడా కల్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.