NTV Telugu Site icon

Buddha Venkanna: జగన్‌పై బుద్దా వెంకన్న ఫైర్‌.. చంద్రబాబు తీరు దేశానికే ఆదర్శం..!

Budda Venkanna

Budda Venkanna

Buddha Venkanna: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై ఫైర్‌ అయ్యారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వరదల సమయంలో చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శం అన్నారు.. ఇంటింటికీ ఆహారం, మంచినీరు, అందించారు.. ప్రజలు అందరూ చంద్రబాబు వల్లే నేడు ఈ వరదల నుంచి బయట పడ్డామని గొప్పగా చెప్పారు.. ఇటువంటి వాటిని చూసి వైసీపీ నేతలు భరించ లేక పోతున్నారు.. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడానికి సిగ్గు ఉండాలి.. అబద్దాలు ప్రచారం చేసే అడ్రెస్ లేకుండా పోయారు.. మళ్లీ చేస్తే.. వైసీపీ భూస్థాపితం కావడం ఖాయం అని జోస్యం చెప్పారు.. దమ్ముంటే వరదల్లో అవినితి జరిగిందని బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు.. అవినీతికి ఆస్కారం లేకుండా కూటమి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు.

Read Also: Kamala Harris: అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే నేను రష్యా అధ్యక్షుడిని కలవను..

వరదల్లో ప్రజలు అల్లాడితే ఏసీ గదిలో కూర్చున్న వ్యక్తి జగన్ అని మండిపడ్డారు వెంకన్న.. ఏనాడైనా బురదలో అడుగు పెట్టి ప్రజలను కలిశావా? నువ్వా పేద ప్రజల కోసం మాట్లాడేది.. వరద ప్రజలకు నువ్వెంత సహాయం చేశావు..? కోటి రూపాయలు ప్రకటించిన జగన్ ఎవరికి ఖర్చు పెట్టారు..? సిగ్గు శరం‌ లేకుండా అసత్యాలు, అబద్దాలు ప్రచారం చేస్తావా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. విపత్తు ఎప్పుడు వచ్చినా నేనున్నా అని ప్రజలతో ఉండే సీఎం చంద్రబాబు అని పేర్కొన్నారు.. ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ కూడా నీతులు వల్లిస్తున్నాడు.. అబద్దాలు చెప్పడానికి కూడా అర్ధం లేదా మీకు.. రాష్ట్రాన్ని నాశనం చేయాలనే మీ కుట్ర లను తిప్పి కొడతాం అన్నారు.. 151 స్థానాల నుంచి 11స్థానాలకు ప్రజలు నిన్ను పరిమితం చేశారు.. ఇలాంటి కుట్రలు చేస్తే ఒక్క స్థానం కూడా ఉండదని జోస్యం చెప్పారు టీడీపీ నేత బుద్దా వెంకన్న..

Show comments