Site icon NTV Telugu

PVN Madhav: మన ప్రాంతాలలో తయారయ్యే ఉత్పత్తులే కొనాలి.. మళ్లీ స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలి..

Pvn Madhav

Pvn Madhav

PVN Madhav: మన ప్రాంతాలలో తయారయ్యే ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి.. మళ్లీ దేశ వ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్.. విజయవాడలో సారథ్యం యాత్రలో భాగంగా కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటర్ లో చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు.. స్థానికంగా ఉన్న పలు సమస్యలను మాధవ్ దృష్టి కి తెచ్చారు ప్రజలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరు పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు ప్రజలు.. ఇక, ఈ సందర్భంగా మాధవ్‌ మాట్లాడుతూ.. అనేక ఆలోచనలు, చర్చల ద్వారా ఎటువంటి సమస్య కు ఆయినా పరిష్కారం దొరుకుతుందన్నారు.. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, అభివృద్ధిపై అభిప్రాయాలను తెలుసుకుంటున్నాం.. ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, అక్కడి‌ విశిష్టతను గుర్తించి వాటిని‌ కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం.. టీ తాగుతూ… ప్రజలు ఆలోచనలు, ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలను తెలుసుకుంటున్నాం.. భవిష్యత్తులో ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో కూడా చెబితే సూచనలు స్వీకరిస్తాం అన్నారు.

Read Also: Donald Trump: మనసు మార్చుకున్న ట్రంప్.. జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గింపు

అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చెందుతుందన్నారు మాధవ్.. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం బాగా దెబ్బతింది.. కూటమి ప్రభుత్వంలో అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుంది.. కేంద్రం సహకారంతో వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని వెల్లడించారు.. త్వరలోనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందడం అందరూ చూస్తారని తెలిపారు. ఇక, జీఎస్టీ పన్నులు తగ్గించి పేద, మధ్య తరగతి ప్రజలకు మోడీ ఉపశమనం కలిగించారు.. నిత్యావసర వస్తువుల ధరలు బాగా తగ్గడం ద్వారా ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు.. అయితే, సిగరేట్, గుట్కా వంటి మత్తుపదార్థాలకు, లగ్జరీ కార్లుకు మాత్రం నలభై శాతం పన్ను పెంచారని గుర్తుచేశారు.. మోడీ ప్రజల మనిషి… ప్రజల మేలు కోసం ఎప్పుడూ ఆలోచనలు చేస్తారు.. గత ఏడాది ఈ రాష్ట్రానికి పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి.. జాతీయ రహదారుల‌ కనెక్టివిటి, రైలు మార్గాల పెంపు వల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.. విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతి కలుపుతూ ఒ.ఆర్.ఆర్ నిర్మాణం జరుగుతుంది.. అన్ని రకాల‌ పరిశ్రమలు మన రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్నాయన్నారు..

Read Also: TTD: క్రమంగా పెరుగుతోన్న భక్తుల తాకిడి.. టీటీడీ కీలక నిర్ణయం..

ఇక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా ప్రజల ఆదాయ వనరులు పెరుగుతున్నాయి.. 75 వసంతాల స్వాతంత్ర్య కాలంలో ఎంతో పురోగతి సాధించాం అన్నారు మాధవ్.. వచ్చే పాతికేళ్లల్లో ప్రపంచంలో మన భారతదేశం మొదటి స్థానంలో ఉండాలనేది మన లక్ష్యంగా పేర్కొన్న ఆయన.. మన ప్రాంతాలలో తయారయ్యే ఉత్పత్తులును కొనుగోలు చేయాలి అని సూచించారు.. మళ్లీ దేశ వ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలని ఆకాక్షించారు.. ప్రజలు కూడా ఆలోచనలు చేయండి… అరాచక పాలన కావాలా.. అభివృద్ధి పాలన కావాలా.. అనే చర్చ పెట్టండి.. ఆత్మ నిర్భర్ భారత్ కోసం అందరం క‌లిసి అడుగులు వేద్దాం అని పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్.

Exit mobile version