Site icon NTV Telugu

Balakrishna: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న బాలయ్య.. ఏం మాట్లాడారంటే..?

Balakrishna

Balakrishna

Balakrishna: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు బెజవాడ కనకదుర్గమ్మ. ఇంద్రకీలాద్రిపై ఆరో రోజుకి చేరుకున్నాయి దసరా మహోత్సవాలు.. ఈ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శమనిస్తున్న దుర్గమ్మ ను దర్శించుకున్నారు సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు దుర్గగుడి అధికారులు.. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలయ్య.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నా.. తండోపతండాలుగా అమ్మవారి ఆశీర్వాదం కోసం కఠోర దీక్షతో వస్తున్నారు.. అమ్మవారి దృష్టిలో అందరూ ఒక్కటే.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి ఆకాక్షించారు. ఇక, ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల ఏర్పాట్లు బాగున్నాయి అన్నారు నందమూరి బాలకృష్ణ.. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారని వెల్లడించారు.. సామాన్య భక్తులకు సజావుగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు అని అభినందించారు నటసింహ, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..

Exit mobile version