Site icon NTV Telugu

Ayyanna Patrudu: అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలి..? ఎమ్మెల్యేలకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా?

Ayyanna Patrudu

Ayyanna Patrudu

Ayyanna Patrudu: ఉద్యోగులు డ్యూటీకి వెళ్లకపోతే జీతం కట్ చేస్తారు.. మరి, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలి..? అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. విజయవాడలో NTR సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగి.. ఈ కార్యక్రమానికి హాజరైన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇవ్వమా?.. వినకపోతే జీతం కట్ చేస్తాం కదా?.. అప్పటికీ వినకపోతే ఉద్యోగం తీసేస్తాం కదా..? అని ప్రశ్నించారు.. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలి? ఎమ్మెల్యేలకు ఏమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా? అని నిలదీశారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడటమే ఎమ్మెల్యేల డ్యూటీ.. అసెంబ్లీకి రానప్పుడు జీతం తీసుకునే హక్కు ఎవరు ఇచ్చారు? అని మండిపడ్డారు.. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా.. పనిచేయని వాడికి నెలకు జీతం తీసుకునే అర్హత ఉందా? అని ప్రశ్నించారు.. అయితే, ప్రజాభిప్రాయం తీసుకుని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు..

Exit mobile version