AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ శాతంపై ఈసీ కీలక ప్రకటన.. విశాఖ ఫస్ట్.. అల్లూరి లాస్ట్..!

Ap Mptc And Zptc Elections

Ap Mptc And Zptc Elections

AP MPTC ZPTC Elections: కొన్ని ప్రాంతాలు హింసాత్మక ఘటనలు మినిహాయిస్తే ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 5న అంటే గురువారం రోజు నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన తుది పోలింగ్ శాతాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా సగటున 70.72 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా అత్యధిక పోలింగ్‌తో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 82.51 శాతం ఓటింగ్ నమోదైంది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 62.01 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రెండు జిల్లాల మధ్య పోలింగ్ శాతంలో గణనీయమైన వ్యత్యాసం కనిపించింది.

జిల్లాల వారీగా పోలింగ్ వివరాలను పరిశీలిస్తే.. శ్రీకాకుళంలో 65.51 శాతం, పార్వతీపురం మన్యంలో 67.13 శాతం, విజయనగరంలో 76.21 శాతం, విశాఖపట్నంలో 82.51 శాతం, అనకాపల్లిలో 75.58 శాతం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 62.01 శాతం, పోలవరంలో 65.48 శాతం పోలింగ్ నమోదైంది. అదేవిధంగా కాకినాడలో 68.94 శాతం, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమలో 66.33 శాతం, తూర్పు గోదావరిలో 71.56 శాతం, పశ్చిమ గోదావరిలో 69.73 శాతం, ఏలూరులో 75.52 శాతం, కృష్ణా జిల్లాలో 73.21 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 75.53 శాతం ఓటింగ్ నమోదైంది.

ఇక, గుంటూరులో 73.12 శాతం, పల్నాడులో 70.93 శాతం, బాపట్లలో 67.47 శాతం, ప్రకాశంలో 68.53 శాతం, మార్కాపురంలో 67.69 శాతం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 70.62 శాతం పోలింగ్ నమోదైంది. తిరుపతిలో 68.67 శాతం, చిత్తూరులో 76.30 శాతం, అన్నమయ్య జిల్లాలో 69.19 శాతం, వైఎస్సార్ కడప జిల్లాలో 71.78 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు.. రాయలసీమలోని ఇతర జిల్లాల విషయానికొస్తే.. అనంతపురంలో 64.38 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 73.71 శాతం, కర్నూలులో 68.29 శాతం, నంద్యాలలో 74.27 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా చూస్తే.. విశాఖపట్నం, విజయనగరం, చిత్తూరు, అనకాపల్లి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అల్లూరి సీతారామరాజు, అనంతపురం, పోలవరం జిల్లాల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలను కలిపి సగటున 70.72 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది..