NTV Telugu Site icon

Minister Suryakumar Yadav: చైనాలో కొత్త వైరస్‌.. స్పందించిన ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి

Satya Kumar Yadav

Satya Kumar Yadav

Minister Suryakumar Yadav: కరోనా మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనాలో తాజాగా మరో కొత్త వైరస్ వెలుగు చూసింది.. అంతేకాదు.. వేగంగా వ్యాప్తి చెందుతూ ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్‌ పెడుతోంది చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV)పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌.. చైనాలో కొత్త వైరస్ కు సంబంధించి వార్తలు వస్తున్నాయి.. అధికారికంగా ధ్రువీకరణ జరగలేదన్న ఆయన.. ఇలాంటి వైరస్ వస్తే మొదట కేంద్రం స్పందిస్తుందన్నారు.. ఒక వేళ వైరస్ ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయని తెలిపారు..

Read Also: Shabbir Ali : ఫార్ములా ఈ రేసులో కేటీఆర్‌ రోజుకో మాట మాట్లాడుతున్నారు

ఇక, 2047 వికసిత్ భారత్ లక్ష్యాలు ఈ కొత్త సంవత్సరం నుంచి నెరవేర్చడం మొదలవ్వాలన్నారు మంత్రి సత్యకుమార్‌.. రాష్ట్రంలో ఉన్న కోటి 40 లక్షలకు పైగా కుటుంబాలకు ఆరోగ్య బీమా ఇస్తామని ఎన్నికల హామీలో భాగంగా చెప్పాం.. ఇన్సూరెన్స్.. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ మూడింటిని కలిపి హైబ్రిడ్ మోడల్ తెస్తున్నాం అన్నారు.. దేశంలో పది రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పద్ధతి అమలు చేస్తున్నాం అని వెల్లడించారు.. హైబ్రిడ్ మోడ్ లో ఏపీలో వైద్య సేవలు ఉంటాయి. 90 శాతం క్లెయిమ్స్.. రెండున్నర లక్షలలోపే ఉంటున్నాయి.. ఆరు గంటల్లోపే ప్రి ఆధరైజషన్ జరుగుతుంది. ముందుగానే ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం ఇస్తున్నాం.. కాబట్టి రోగులకు ఇబ్బంది ఉండదు అని.. క్లెయిమ్ ను రిజెక్ట్ చేస్తే కోర్ట్ కి వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు.. ఇక, క్లెయిమ్ చెల్లింపులో అవకతవకలు కూడా గతంలో జరిగాయిన విమర్శించారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్.

Show comments