NTV Telugu Site icon

Minister Narayana: తీర‌ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్లు, పోర్టుల అభివృద్ధి..

Narayana

Narayana

Minister Narayana: తీర‌ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్లు, పోర్టుల అభివృద్ది ద్వారా జీవ‌నోపాధిని పెంచుతున్నాం అన్నారు మంత్రి నారాయణ.. విజ‌య‌వాడ‌లో తీర‌ప్రాంత ప‌ర్యావ‌ర‌ణ ర‌క్షణ అంశంపై స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిర్వహిస్తున్న జాతీయ స‌ద‌స్సుకు ముఖ్య అతిధిగా హాజరైన ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో తీర‌ప్రాంత అభివృద్దికి, ప‌ర్యావ‌ర‌ణ ర‌క్షణ‌కు ప్రభుత్వం క‌ట్టుబ‌డి ప‌నిచేస్తోందన్నారు.. వాతావ‌ర‌ణ మార్పులు, ప్రకృతి వైప‌రీత్యాల‌తో తీర‌ప్రాంతం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది.. మ‌త్స్యకారుల‌తో పాటు వ్యవసాయంపై ఆధార‌ప‌డిన వారి జీవనోపాధికి ముప్పు క‌లుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, స‌ముద్రంపై ఆధార‌ప‌డిన వారికి తీర‌ప్రాంత వాసులకు ప్రభుత్వం అన్ని ర‌కాలుగా స‌హ‌కారం అందిస్తోందని వెల్లడించారు.. తీర‌ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్‌లు, పోర్టుల అభివృద్ది ద్వారా జీవ‌నోపాధిని పెంచుతున్నామని పేర్కొన్నారు.. ప‌ర్యావ‌ర‌ణ ప్రభావిత‌మైన అంశాలకు ప‌రిష్కారం దిశ‌గా జాతీయ స‌ద‌స్సు నిర్వహించ‌డం అభినంద‌నీయం.. స‌ద‌స్సు ద్వారా ప‌ర్యావ‌ర‌ణ ప్రభావిత అంశాల‌కు ఆర్కిటెక్ట్ లు, ప్లాన‌ర్ లు ప‌రిష్కారం చూపిస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.

Read Also: Devara Jatharaa: టైగర్ వేటకు సమయం ఆసన్నమైంది.. మరికొన్ని గంటల్లో ఎరుపెక్కనున్న థియేటర్లు!