Vijayawada Utsav: ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు 11 రోజుల పాటు విజయవాడ ఉత్సవ్ పేరుతో కృష్ణానది తీరంలో భారీ ఈవెంట్స్, ఎగ్జిబిషన్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగా.. నిర్వహకులకు షాక్ ఇచ్చింది ఏపీ హైకోర్టు.. విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానికి సంబంధించిన దేవాదాయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. దేవాదాయ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది.. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించింది.. అందులో తోలిన గ్రావెల్, మట్టి, కంకరలను వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది.. అంతేకాదు, ఆ భూములను యథాస్థితికి తీసుకు రావాలని ఆదేశించింది..
Read Also: Kerala: కేరళలో దారుణం.. గే డేటింగ్ యాప్‌లో పరిచమైన బాలుడిపై 14 మంది అత్యాచారం..
అయితే, ఈ భూములను ఇప్పటికే 56 రోజుల పాటు లీజుకు ఇచ్చింది దేవాదాయశాఖ.. ఇక, లీజు మొత్తాన్ని కూడా గొడుగుపేట దేవస్థానానికి ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెల్లించారు.. కానీ, దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు.. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. కాగా, సోసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సారథ్యంలో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు ‘విజయవాడ ఉత్సవ్’ పేరుతో కృష్ణా నది తీరంతో పాటుగా నగరంలోని మైదానాల్లో సంగీత, సినీ, సాంస్కృతిక వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.. మరోవైపు, కృష్ణానదిలో పడవల పోటీలు, డ్రోన్ షో, ఎగ్జిబిషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఏర్పాట్లు సాగుతున్నాయి.. దేవీ నవరాత్రుల సందర్భంగా బెజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలు భక్తులు తరలిరానుంగా.. వారిని దృష్టిలో ఉంచుకుని విజయవాడ ఉత్సవ్‌కు ఏర్పాట్లు చేస్తుండగా.. ఇప్పుడు హైకోర్టు వారికి షాక్ ఇచ్చినట్టు అయ్యింది..
