Site icon NTV Telugu

AP SSC 2025 Valuation: SSC వాల్యుయేషన్‌లో లోపాలు.. ఐదుగురిపై వేటు

Ap Ssc 2025 Valuation

Ap Ssc 2025 Valuation

AP SSC 2025 Valuation: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు SSC వాల్యుయేషన్‌ లోపాలు కలకలం సృష్టిస్తున్నాయి.. రికార్డుస్థాయిలో రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌ కోసం ఏకంగా 66,363 దరఖాస్తులు వచ్చాయి.. దీంతో, వాటిపై ఫోకస్‌ పెట్టింది ప్రభుత్వం.. SSC వాల్యుయేషన్‌లో లోపాలు గుర్తించింది సర్కార్.. దీనికి బాధ్యులైన ఐదుగురిని సస్పెండ్‌ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది.. టెన్త్‌ పరీక్షల్లో రికార్డు స్థాయిలో.. 66 వేలకు పైగా రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులు వచ్చాయి. దీంతో విద్యా శాఖ అలెర్ట్ అయింది.. 11 వేలకు పైగా స్క్రిప్టుల మార్కులలో లోపాలు గుర్తించారు. ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు చివరి తేదీ ముగియడంతో.. విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. జూన్‌ 5 నుంచి 10 వరకు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు.. గడువు పొడిగించాలని పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది.

Read Also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై అంతర్జాతీయ నిపుణులు ఏం తేల్చారంటే..!

మొత్తంగా SSC 2025 వాల్యుయేషన్ లో లోపాలు గుర్తించి చర్యలకు ఉపక్రమించింది పాఠశాల విద్యాశాఖ.. తొలిసారిగా 5 మంది వాల్యుయేటర్లను సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది.. ఒక విద్యార్థినికి అన్ని సబ్జెక్టులలో 90కి పైగా మార్కులు వచ్చి సోషల్ లో 23 రావడంతో రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకుంది.. రివాల్యుయేషన్ లో సోషల్ లో 96 మార్కులతో పాటు మొత్తం 575/600 రావడంతో మిగతా విద్యార్ధుల్లో ఆందోళన మొదలైంది.. తప్పులలో ప్రధానంగా టోటలింగ్ లోపాలు, మార్కులు సరిగ్గా OMR షీట్‌ లో నమోదు చేయకపోవడం, కొన్ని సమాధానాలను అసలు గుర్తించకపోవడంగా గుర్తించారు.. మూడు స్థాయిల్లో పర్యవేక్షణ ఉన్నా, ఈ లోపాలు నివారించకపోవడంపై విద్యాశాఖ సీరియస్ అయ్యింది.. ఇక, తాజా RV/RC ఫలితాలను జూన్ మొదటి వారంలో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు..

Exit mobile version