Site icon NTV Telugu

CM Chandrababu: ఎడ్యుకేషన్ హబ్‌లుగా విజయవాడ, విశాఖ, తిరుపతి..

Babu

Babu

CM Chandrababu: విజయవాడ, విశాఖ, తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్‌లుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజయవాడలో జరిగిన జాతీయ విద్యాదినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో టీచర్లను అవమానించారని.. బ్రాందీ షాపుల ముందు నిలబెట్టారని విమర్శించారు. సమాజంలో విలువలు పడిపోతూ పతనావస్థకు వస్తున్నాయి. విలువలు కాపాడటానికి, నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావుగారిని పెట్టాం అన్నారు.. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ‌164 మందిని రాష్ట్ర ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సీఎం చంద్రబాబు.. ప్రభుత్వం తరపున రూ. 20 వేల నగదు, షీల్డ్స్‌తో శాలువాతో సత్కరించారు.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్వేపల్లి రాధాకృష్ణ.. ఇద్దరూ విద్యా వ్యవస్థకి ఎనలేని సేవలు అందించారు. వారిని మనం గౌరవించుకోవాలి అన్నారు సీఎం చంద్రబాబు.. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత గురువులది. తల్లిదండ్రులు తరువాత గురువు ఎప్పటికీ గుర్తు ఉంటారు. నాకు విద్య నేర్పిన గురువులు ఇప్పటికీ నాకు గుర్తే అన్నారు.. సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతిగా ఎదిగారు. ఈ రెండూ కలిసిన రోజు ఈ రోజు మీ విద్యాశాఖ మంత్రి మోడల్‌గా ఈ సభ పెట్టారు అన్నారు.. ఒక మంచి టీచర్ ఎప్పటికి మంచి టీచరే.. అది మన ప్రవర్తన బట్టి ఉంటుందన్నారు.. ఇంగ్లీష్ అనేది బ్రతకటానికి అవసరం, అలా అని తెలుగు భాషని మర్చిపోకూడదు అని సూచించారు. రెండూ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళాలికానీ, తెలుగుని తక్కువ చేసి చూడకూడదు అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..

Exit mobile version