AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
- ఏపీలో మోగనున్న బడిగంట
- రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
- ఏడాది క్యాలెండర్ విడుదల చేసిన విద్యాశాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో బడిగంటకు వేళాయింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత స్కూళ్లు తెరుచుకోబోతున్నాయి. శుక్రవారం నుంచి స్కూళ్లు పున:ప్రారంభం అవుతున్నాయని విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు ఏడాది క్యాలెండర్ను విడుదల చేసింది. 229 పని దినాలు, 87 రోజులు సెలవు దినాలుగా ప్రకటించింది. పరీక్షల షెడ్యూల్ను సైతం విద్యాశాఖ విడుదల చేసింది.

Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
రెండు నెలల పాటు చిన్నారులు ఆటాపాటలతో ఎంజాయ్ చేశారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఇప్పుడు మళ్లీ బ్యాగ్లు భుజాన వేసుకుని.. పుస్తకాలతో కుస్తీ పట్టే సమయం దగ్గర పడింది. నేటితో వేసవి సెలవులు ముగియడంతో లక్షలాది మంది విద్యార్థులు మళ్లీ బడి బాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది.

విద్యాశాఖ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పని దినాలు ఉండగా, 87 రోజులు సెలవులు కేటాయించారు. విద్యార్థుల విద్యా ప్రగతితో పాటు పాఠ్యాంశాల పూర్తి, పరీక్షల నిర్వహణకు అనుగుణంగా ఈ క్యాలెండర్ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో దసరా, సంక్రాంతి, క్రిస్మస్ తదితర ప్రధాన పండుగల సందర్భంగా సెలవులను ప్రకటించారు. అలాగే ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు కలిపి మొత్తం 87 రోజుల విరామం లభించనుంది.
అంతేకాకుండా విద్యాశాఖ వార్షిక పరీక్షలు, త్రైమాసిక, అర్ధవార్షిక పరీక్షల షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, సమయపాలన పాటించడం లక్ష్యంగా పరీక్షల తేదీలను ముందుగానే ప్రకటించినట్లు పేర్కొంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకునే అవకాశం లభించనుంది.
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పాఠ్యపుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు హాజరై విద్యలో మరింత రాణించాలని విద్యాశాఖ ఆకాంక్షించింది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?