NTV Telugu Site icon

Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ సమయంలో దర్శనానికి రావొద్దు..

Kanaka Durga Temple

Kanaka Durga Temple

Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ప్రతీరోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు.. అయితే, సామాన్యుల భక్తులకు ఇబ్బంది లేకుండా.. కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు.. ఇంద్రకీలాద్రి వచ్చే వీఐపీలు, వికలాంగులు, వృద్ధులు ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య దర్శనానికి రావొద్దు అని విజ్ఞప్తి చేశాసింది.. ఇక, ఉదయం 11:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మహానివేదన కనుక దర్శనం నిలిపివేయబడును అని.. ఆ సమయంలో ప్రత్యేక‌ దర్శన ఏర్పాటు ఉండదు కనుక.. ఆలయ నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది.. ఆలయ ఆచారంగా వస్తున్న మహానివేదన సమయంలో ఈ సూచనను వీఐపీలు, వికలాంగులు, వృద్ధులు పాటించాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అధికారులు. కాగా, బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు ప్రతీనిత్యం పెద్ద సంఖ్యలో తరలివచ్చే విషయం విదితమే..

Read Also: Monty Panesar: విరాట్‌ కోహ్లీ సెంచరీతో అదరగొడతాడు.. టీ20 ప్రపంచకప్‌ భారత్‌దే..