NTV Telugu Site icon

Vijayawada Floods: వరద ముంపు ప్రాంతంలో విషాదం.. భోజనం తెచ్చేందుకు వెళ్లి విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

Electric Shock

Electric Shock

Vijayawada Floods: ఓవైపు కృష్ణా నది.. మరోవైపు బుడమేరు వరదతో విజయవాడ నగరం అతలాకుతలం అయ్యింది.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో కోలుకోలేదు.. అయితే.. వరద ముంపు ప్రాంతంలో ఈ రోజు ఓ విషాద ఘటన చోటు చేసుకుంది.. వరద నీరు తగ్గటంతో ఇంటి నుంచి బయటకు భోజనాలు తెచ్చేందుకు వెళ్లిన నాగబాబు అనే యువకుడికి విద్యుత్ షాక్‌తో ప్రాణాలు విడిచాడు.. స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వచ్చి సీపీఆర్ చేసినా నాగబాబు ప్రాణాలు కాపాడలేకపోయాడు.. రోడ్డుపై నీరు ఉండడంతో.. ఆ నీటి నుంచి ఎందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో.. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకునే దాటేందుకు ప్రయత్నించాడు నాగబాబు.. అయితే.. విద్యుత్‌ స్తంభానికి అప్పడికే కరెంట్‌ పాస్‌ అయి ఉందని.. స్తంభం పట్టుకున్న వెంటనే నాగబాబుకు షాక్‌ తగిలిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.. కానీ, విద్యుత్ స్తంభానికి కరెంట్ లేదని.. పక్కనే ఉన్న బడ్డీ కొట్టులో ఉన్న విద్యుత్ వల్ల షాక్ తగిలినట్టు అధికారులు చెబుతున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. కానీ, కరెంట్‌ షాక్‌ ఎలా కొట్టినా.. నాగబాబు ప్రాణాలు మాత్రం పోయాయి.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి.

Read Also: Hyderabad Crime: రాజేంద్రనగర్ లో గంజాయి ముఠా కాల్పుల కలకలం..

Show comments