NTV Telugu Site icon

ఆ భయంతోనే విపక్షం అడ్డదారులు తొక్కుతోంది : విజయసాయిరెడ్డి

టీడీపీ నేతలపై ఎంపీ విజయసాయిరెడ్డి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని బూతులు తిడుతూ రాజకీయాలు చేయడం సమంజసం కాదన్నారు. ఏపీలో టీడీపీ కనుమరుగవుతుందనే భయంతోనే విపక్షం అడ్డదారులు తొక్కుతోందని ఆయన అన్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఇలాంటి ఘటనలకు తెరలేపారన్నారు. పట్టాభిరామ్‌ సీఎంపై చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు తెలియకుండా చేశాడా అంటూ ప్రశ్నించారు.

ఇదంతా చంద్రబాబు ఆడుతున్న నాటకమని, ఈ గందరగోళానికి కేడర్‌ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్షకు ప్రారంభించారు. మరోవైపు.. వైసీపీ నేతలు సైతం పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనాగ్రహా దీక్ష చేపట్టారు.