ఎప్పుడు ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈ సారి ఏపీ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఏపీ బీజేపీ నేతలను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. బీజేపీ నేతలు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజాదరణ పొందుతుంటే అది బీజేపీ నేతలకు నచ్చడం లేదు. అందుకే ప్రభుత్వం పై ఎప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఆయన బీజేపీ నేతలను తీవ్రంగా విమర్శించారు.
Read Also: మహిళలను హింసించడం దేవుడ్ని అవమానించినట్టే: పోప్ ఫ్రాన్సిస్
ఏపీ బీజేపీ నేతలవి మరుగుజ్జు ఆలోచనలు. గుంటూరు జిన్నా టవర్, వైజాగ్ కేజీహెచ్ పేర్లు మార్పు కోరే బదులు ప్రత్యేక హోదా, పోలవరం నిధులు కోసమో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ వద్దనో తమ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెస్తే మంచిది. చీప్ లిక్కర్ డామేజ్ కవరింగుకు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
