NTV Telugu Site icon

Vijaya Sai Reddy: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 19 లోక్‌సభ, 133 అసెంబ్లీ సీట్లు వస్తాయి

Vijaya Sai Reddy

Vijaya Sai Reddy

Vijaya Sai Reddy: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఓ సర్వే ఫలితాలను బయటపెట్టారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీకి 19 ఎంపీ సీట్లు, 133 అసెంబ్లీ సీట్లు వస్తాయని ఇండియా టీవీ దేశ్ కీ ఆవాజ్ సర్వే అంచనా వేసిందని ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వల్ల వచ్చే 20 నెలల్లో వైసీపీకి లబ్ధి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. దాంతో మరోసారి 150కి పైగా సీట్లు కచ్చితంగా సాధిస్తామని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు ఎప్పటికప్పుడు ట్వీట్ల ద్వారా టీడీపీ నేతలకు ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్లు ఇస్తున్నారు. తమకు మరో అవకాశం ఇస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు చేసిన ప్రకటన పట్ల విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.’ మరో ఛాన్సిస్తే పోలవరం పూర్తి చేస్తాడట మా చంద్రం అన్నయ్య. 14 ఏళ్లు సీఎంగా ఉండి పోలవరం గట్లపై గడ్డి కూడా పీకలేకపోయాం కదా బాబన్నయ్యా. ప్రతి సోమవారం పోలవరం టూర్లువేసి కోట్లు కొల్లగొట్టావు. మంగళవారం మాటలు ఆపేసి ముందు కందిపప్పు, కిరోసిన్ ఎలా కొలుస్తారో తెలుసుకో. కుటుంబ పరువు పోతుంది’ అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు.

Show comments