Site icon NTV Telugu

విజయసాయిరెడ్డి-రఘురామ ట్వీట్ వార్.. ఇద్దరి మధ్య మాటల యుద్ధం

ఢిల్లీ నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మీడియా సమావేశాలు నిర్వహిస్తుండటంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఓ నేత ప్రేమ కోసం ర‌ఘురామ‌కృష్ణంరాజు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నార‌ని ఎద్దేవా చేశారు. ‘ఎవరి మొప్పు కోసమో విప్పుకు తిరిగే స్థాయికి దిగజారావా రఘురామా.. 40 ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్కవాళ్ల‌కు ప్రేమ బాణాలు వేస్తుంటే అతడి ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా? పనిచేసే వారికే పట్టం కడతారు ప్రజలు. ఢిల్లీలో కూర్చుని కాకమ్మ కబుర్లు చెబితే వాళ్లే రాళ్లతో కొడతారు’ అంటూ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు చేశారు.

https://twitter.com/VSReddy_MP/status/1484395349536288768

అయితే విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు రఘురామకృష్ణంరాజు కూడా కౌంటర్ ఇచ్చారు. ‘నువ్వు నీ ప్రేమ బాణాలు విశాఖ నవ యువతుల మీద విసురుతున్నావు అంట కదా.. పని చెయ్యకుండా ప్రజలను పీక్కుతింటున్న మిమ్మల్ని త్వరలో ఆ ప్రజలే రాళ్లతో కొడతారు. నువ్వు ఎన్ని ట్వీట్లు పెట్టినా ఏ1 నీకు రాజ్యసభ రెన్యువల్ చెయ్యడు అంట. ముందు నువ్వు ఏ1 చేతిలో తన్నులు తినకుండా ఉండేలా చూసుకో’ అంటూ ర‌ఘురామ‌కృష్ణంరాజు చుర‌క‌లు అంటించారు.

Exit mobile version