Site icon NTV Telugu

Rajya Sabha: రాజ్యసభ ప్యానల్‌వైస్‌ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి, పీటీ ఉష

Vijaya Sai Reddy And Pt Ush

Vijaya Sai Reddy And Pt Ush

రాజ్యసభ ప్యానల్‌వైస్‌ చైర్మన్‌గా మళ్లీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని నియమించారు.. అయితే, 10 రోజుల క్రితం సాయిరెడ్డిని.. వైస్ చైర్మన్‌గా నియమించినా.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో.. ఆయన పేరు తొలగించారు. అయితే, ఇప్పుడు మళ్లీ రాజ్యసభ ప్యానల్‌ వైస్‌ చైర్మన్‌గా విజయసాయిరెడ్డిని నియమించారు.. సాయిరెడ్డితో పాటు.. పీటీ ఉషను కూడా ప్యానల్‌వైస్ చైర్మన్‌గా నియమిస్తూ.. రాజ్యసభలో ప్రకటించారు భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్ ధన్కర్.. దీంతో.. విజయసాయి రెడ్డి, పీటీ ఉషను రాజ్యసభ ఎంపీలు అభినందించారు.. వారికి ధన్యవాదాలు తెలిపారు ఇద్దరు ఎంపీలు.. అయితే, తొలిసారిగా నామినేటెడ్ ఎంపీని ప్యానెల్ వైస్ చైర్మన్‌గా నియమించినట్లు జగదీప్ ధన్కర్‌ వెల్లడించారు..

Read Also: Corona Fear: ఏపీలో విచిత్ర ఘటన.. నాలుగేళ్లుగా తల్లి, కూతురు ఇంటికే పరిమితం

Exit mobile version