NTV Telugu Site icon

Vijayasai Reddy: ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు కాబట్టే పదవుల్ని వదులుకున్నా..

Vijaya Sai

Vijaya Sai

Vijayasai Reddy: వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా.. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే.. ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని పేర్కొన్నారు. అంతేగాక భయం అనేది నాలో ఏ అణువులోను లేదు కాబట్టే.. రాజ్యసభ పదవితో పాటు పార్టీ పదవుల్ని వదులుకున్నా అని వైఎస్ జగన్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు. అయితే, వైసీపీలో కీలక నేతగా పని విజయసాయిరెడ్డి కొద్ది రోజుల క్రితం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేగాక ఇది తన వ్యక్తిగత నిర్ణయం, తనపై ఎవరి ఒత్తిడి లేదని తేల్చి చెప్పారు.

Read Also: OTT : ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవంటే..?

ఇక, తాను ఏ పార్టీలో చేరబోనని, వ్యవసాయం చేసుకుంటానని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. అయితే, వైసీపీ నేతల రాజీనామాలపై గురువారం నాడు జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరికైనా క్యారెక్టర్ ఉండాలి, భయం ప్రలోభాలకు లొంగి తమ క్యరెక్టర్ ను తగ్గించుకోవద్దని పేర్కొన్నారు. అంతేగాక విజయసాయిరెడ్డి సహా ఎవరికైనా ఇది వర్తిస్తుందంటూ కామెంట్స్ చేశారు. దీంతో వైఎస్ జగన్ వ్యాఖ్యలకు విజయ సాయిరెడ్డి కౌంటర్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.