మహానాడు వేదికగా ఒకవైపు టీడీపీ నేతలు అధికార పార్టీపై విమర్శల దాడి చేస్తుంటే… వైసీపీ నేతలు కూడా అదే రీతిలో టీడీపీని టార్గెట్ చేశారు. చంద్రబాబు పుట్టుకకు నిర్వచనం చెప్పారు ఎంపీ విజయ సాయిరెడ్డి. చంద్రబాబు, టీడీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయ సాయిరెడ్డి. వంచన అనే తండ్రికి, వెన్నుపోటు అనే తల్లి కి పుట్టిన ఉన్మాది బిడ్డ చంద్రబాబు అన్నారు విజయసాయి.
ఉన్మాదంతోనే పిల్లను ఇచ్చిన పాపానికి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచాడు. మరో రెండేళ్లలో చంద్రబాబు కొడుకు కూడా తండ్రికి వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. ఎలిమినేటి మాధవ రెడ్డి పై చంద్రబాబుకు కోపం ఉండి ఉండవచ్చు. ఆ కోపాన్ని బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీల మీద ఎందుకు చూపిస్తున్నావ్?? బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అన్నారు విజయసాయి.
చంద్రబాబు ఏపీ నుంచి తెలంగాణాకు వెళ్ళి పోయాడు. కిక్ బాబు, సేవ్ ఏపీ ఇదే వైసీపీ నినాదం అన్నారు విజయసాయి. మహానాడును ఎన్టీఆర్‌కు సంవత్సరీకంగా చేస్తున్నాడు. కార్యకర్తలకు భోజనాల రూపంలో శ్రాద్ధం పెడుతున్నాడు. మహానాడు మహా శ్మశానం. టీడీపీ లో ఉన్న వాళ్ళందరూ కామారావులే అన్నారు విజయసాయి. లోకేష్ కి విలువ లేదు. ఒక వ్యక్తిగా పరిగణించడం లేదు. ఉన్మాది చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబుని ప్రజలు తరిమికొడతారన్నారు.
నారా అంటే నాసిరకం రాజకీయ నాయకుడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి గా ఉండే చంద్రబాబు సాధించింది ఏంటి?? ఒక ఉన్మాది పెట్టే మహాప్రస్థానానికి ఎవరైనా వస్తారా?? కార్యకర్తలే రావడం లేదు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంటుంది? పనికి మాలిన నేతలు మహానాడుకి వచ్చారు. ఏపీ సంపదను కొల్లగొట్టడానికి టీడీపీ నేతలు వచ్చారన్నారు. రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబుని తరిమికొట్టాల్సిన అవసరం లేదన్నారు. అప్పుడే ఏపీకి భవిష్యత్తు వుంటుందన్నారు విజయసాయిరెడ్డి.
