NTV Telugu Site icon

Vigilance Raids: ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో విజిలెన్స్ తనిఖీలు..

Petrol Bunks

Petrol Bunks

Vigilance Raids: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సుమారు 73 బంకుల్లో 36 బృందాలు సోదాలు కొనసాగుతున్నాయి. లీగల్ మెట్రాలజీ కింద 6 కేసులు నమోదు చేశారు. నెల్లూరులో రూ. 32.77 లక్షలు విలువైన పెట్రోల్, 14.85 లీటర్ల డీజిల్, 561 లీటర్ల 2టీ ఆయిల్ ను సీజ్ చేయగా.. అనంతపురంలో 75 వేల రూపాయలు విలువ చేసే 3 పల్సర్ బోర్డులు సీజ్ చేశారు. ఇక, కర్నూలులో ఒక బంక్ కు రూ. 25 వేలు జరిమానా విధించారు అధికారులు.

Read Also: Maha Kumbh: ‘‘ అలసిపోయాం, ప్లీజ్ ఇక రాకండి’’.. భక్తులకు ప్రయాగ్‌రాజ్ ప్రజల విన్నపం..

ఇక, తనిఖీల్లో పల్సర్ బోర్డుల ట్యాంపరింగ్ ను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఆత్మకూర్ లో 1, అనంతపురంలో రెండు అదనంగా ఏర్పాటు చేసిన చిప్ ఫిట్టింగ్ చేసినట్టు గుర్తించారు. రాజమండ్రిలో 5 లీటర్లకు 50 ఎంఎల్, ఏలూరులో 5 లీటర్లకు 30 ఎంఎల్, నెల్లూరులో 40 ఎంఎల్ తక్కువ పెట్రోల్ వస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. బంకుల్లో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఇక, ఈ సోదాలు క్రమంగా కొనసాగుతాయని చెప్పుకొచ్చారు.