NTV Telugu Site icon

Vidadala Rajini: చంద్రబాబుకు అది తప్ప.. మరే ధ్యాసే లేదు

Vidadala Rajini On Chandrab

Vidadala Rajini On Chandrab

Vidadala Rajini Fires On Chandrababu Naidu: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి విడదల రజిని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీలను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో బీసీల సంక్షేమం కోసం కేవలం రూ. 19 వేల కోట్లను మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. కానీ.. వైసీపీ ప్రభుత్వం మాత్రం గత మూడున్నరేళ్లలోనే బీసీలకు రూ. 1.63 లక్షల కోట్లను ఖర్చు చేసిందని పేర్కొన్నారు. చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా వినియోగించుకున్నారని మండిపడ్డారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత వారిని నిర్లక్ష్యం చేశారని చెప్పారు.

Big Twist in Vaishali Case: వైశాలి కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. మాకు ఏడాది క్రితమే పెళ్లైందంటున్న నవీన్‌

తమ వైసీపీ ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉందని.. వారి ఉన్నతి కోసం ఎన్నో సంక్షేమ ఫథకాలను అమలు చేస్తున్నామని విడదల రజిని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం, ప్రతి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టి, విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే పని అని, అది తప్ప ఆయనకు మరో ధ్యాసే లేదని విమర్శించారు. ఇక మంగళగిరిలో త్వరలోనే ఎయిమ్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ పథకం ద్వారా బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని, ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలను అందించే వీలు కలుగుతుందని అన్నారు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్టు ఎయిమ్స్‌ని నీటి సమస్య లేనే లేదని, విజయవాడ మున్సిపల్ కమిషనరేట్, తాడేపల్లి-మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి మూడు లక్షల లీటర్ల చొప్పున నీరు సరఫరా అవుతోందని స్పష్టం చేశారు.

Husband Forced Wife: కీచక భర్త.. ఫ్రెండ్స్‌తో పడుకోమని బలవంతం.. రికార్డ్ కూడా చేశాడు

అంతకుముందు కూడా.. చంద్రబాబు తన పాలనలో బీసీల‌కు వెన్నుపోటు పొడిచార‌ని విడదల రజిని ఆరోపించారు. బీసీల‌కు రాజకీయ గౌరవం ఇచ్చింది ఒక్క సీఎం జగన్ మాత్రమేనన్నారు. జగన్ బీసీ బాంధ‌వుడ‌ని.. చంద్రబాబు బీసీల ప‌ట్ల రాబందు చెప్పారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకి బీసీలు గుర్తొస్తారని, మూడున్నరేళ్లలోనే బీసీల్లో జగన్ సంపాదించిన పేరు చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. బీసీలకు ఏం చేశామ తాము ధైర్యంగా చెప్పగలమని, మరి చంద్రబాబుకు ఆ ధైర్యం ఉందా? అని సవాల్ చేశారు. అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదని తేల్చి చెప్పారు.