నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.. మొదట కృష్ణపట్నంతో ప్రారంభమైన కరోనా ఆయుర్వేద మందు పంపిణీ.. క్రమంగా నెల్లూరు జిల్లా.. పక్క జిల్లాలు.. పక్కా రాష్ట్రాలు.. ఇలా క్రమంగా కరోనా బాధితులు కృష్ణపట్నం బాటపట్టారు.. రోగుల తాకిడి ఎక్కువ కావడంతో.. మందు పంపిణీ కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి విచ్చింది.. అయితే, ఈ వ్యవహారంపై ఆరా తీశారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఆయుష్ ఇన్ ఛార్జ్ మంత్రి, ఐసిఎంఆర్ డైరక్టర్ జనరల్ తో మాట్లాడారు వెంకయ్య.. నెల్లూరు ఆయుర్వేద మందు మీద అధ్యయనం చేయాలని సూచించారు.. ఆ ఆయుర్వేద మందు మీద అధ్యయనం ప్రారంభించాలని.. ఆయుష్ ఇన్ చార్జ్ మంత్రి కిరణ్ రిజ్జు, ఐసిఎంఆర్ డైరక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ కు సూచించారు ఉప రాష్ట్రపతి.. నెల్లూరు ఆయుర్వేద మందు విషయంలో నెలకొన్న పరిస్థితులు ఉపరాష్ట్రపతి దృష్టికి వచ్చాయి.. దీంతో.. ఆయన వెంటనే కేంద్ర మంత్రి మరియు డైరక్టర్ జనరల్ తో ఫోన్ ద్వారా మాట్లాడారు. తక్షణమే ఆ మందు మీద అధ్యయనం ప్రారంభించి, వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు.
కృష్ణపట్నం కరోనా మందు.. ఆయుష్, ఐసీఎంఆర్‌కు ఉపరాష్ట్రపతి ఫోన్
Venkaiah Naidu