NTV Telugu Site icon

మా ఉద్యోగుల అభిప్రాయాలు చెప్పాం : వెంకట్రామిరెడ్డి

గత కొన్ని రోజలు నుంచి ఏపీలోని ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం పీఆర్‌పీ స్పష్టత ఇవ్వాలంటూ.. అంతేకాకుండా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యం నిన్న సీఎస్‌ సమీర్‌శర్మ సీఎం జగన్‌కు పీఆర్‌ఎస్‌పై నివేదికను అందించారు. అంతేకాకుండా 72గంటల్లో జగన్‌ తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంల ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. మా ఉద్యోగుల అభిప్రాయాలు చెప్పామని, ప్రభుత్వ ఇబ్బందులు అన్నీ సజ్జల చెప్పారని ఆయన వెల్లడించారు.

అన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఫిట్ మెంట్ 34 శాతం తగ్గకుండా ఇవ్వాలని కోరామన్నారు. కానీ 14 శాతం- 27 శాతానికి మధ్య ఒక నెంబర్ చెప్పండి అని సజ్జల అడిగారని, ఎప్పుడూ ఐఆర్ కంటే ఫిట్ మెంట్ 5, 6 శాతం ఎక్కువే ఉంటుందని వెల్లడించామన్నారు. మానిటరీ బెనిఫిట్స్ వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి కాకుండా ఏప్రిల్ నుంచి ఇవ్వటానికి ఆలోచిస్తామన్నారని, సీఎం జగన్ ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. రేపు ముఖ్యమంత్రి తో భేటీ ఉంటుందని తెలిపారన్నారు. ఎరియర్స్ రెండు, మూడు దఫాలుగా అయిన ఇవ్వాలని అడిగామన్నారు. అయితే రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు.