Site icon NTV Telugu

Velampally Srinivas: గుళ్లు కూల్చే వారికి దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదు

Velampally Srinivas

Velampally Srinivas

రేపు వినాయక చవితి సందర్భంగా.. ప్రభుత్వం ఏ ఆంక్షలూ విధించలేదని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ స్పష్టంచేశారు. అంతేకాదు, గణేష్‌ మండపాల అనుమతిని సులభతరం చేశామని తెలిపారు. ఎటువంటి అవాంతరాలు జరగకుండా గతంలో అగ్నిమాపక, పోలీసు, విద్యుత్‌ శాఖలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి అనుమతి కోసం వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సి వచ్చేదన్నారు. అయితే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక సింగిల్‌ విండో విధానాన్ని తెచ్చిందని తెలిపారు. గణేష్‌ మండపాల రుసుము ఒక్క రూపాయి కూడా పెంచలేదని, గత ప్రభుత్వ నిబంధనలే అమలు చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా.. గత టీడీపీ ప్రభుత్వంలో 250 వాట్స్‌ వరకు విద్యుత్‌ వినియోగానికి రూ.1,000 చెల్లించాల్సి వచ్చేదని గుర్తు చేశారు.

కానీ.. ఇప్పుడు దాన్ని రూ.500కు తగ్గించామని చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే.. చవితిపై ప్రభుత్వం నిబంధనలు విధించిందంటూ టీడీపీ ఆఫీసు నుంచి సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తున్నారని చెప్పారు. దానిపై దేవదాయ శాఖ మంత్రి, డీజీపీ, అధికారులు కూడా వివరణ ఇచ్చారని, అయినా సోము వీర్రాజు, టీడీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ఆఫీస్‌ స్క్రిప్టును సోము వీర్రాజు, ఇతర బీజేపీ నేతలు మాట్లాడటం దుర్మార్గమన్నారు. ఆదేవుడి పేరుతో రాజకీయం చేస్తే పుట్టగతులుండవని హెచ్చరించిన ఆయన, చీకట్లో ఆలయాలను ధ్వంసం చేసిన నీచ చరిత్ర ఆనాటి టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షానిదని అన్నారు. అంతేకాకుండా.. ఆలయాలు కూల్చి, విగ్రహాలను ధ్వంసం చేసి, రథాలు తగులబెట్టే వారికి దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదని, పార్టీల నేతలకు చెప్పారు.
MLA Raghunandan Rao : మంత్రి హరీష్‌రావుపై ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఫైర్‌

Exit mobile version